కవర్ డ్రైవ్స్.. స్వీప్ షాట్లు... విద్యార్థులతో క్రికెట్ ఆడిన రాహుల్ గాంధీ

అప్పుడప్పుడు రాజకీయ నేతల హెలికాప్టర్లలో సాంకేతిక సమస్య తలెత్తుతుంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొంటారు. లేదంటే బాగయ్యే వరకు అక్కడే ఉంటారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. హర్యానాలోని రేవారిలో దిగడంతో.. అక్కడ కాసేపు ఆటవిడుపు సమయం లభించింది. దీంతో స్థానిక పిల్లలో కలిసి రాహుల్ గాంధీ ఆటలాడారు.

హర్యానాలోని మహేంద్రగఢ్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు బదులు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడినుంచి ఢిల్లీకి హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే ప్రతికూల వాతావరణం వల్ల రేవారి గ్రౌండ్‌లో హెలికాప్టర్ ల్యాండయ్యింది. దీంతో అక్కడ ఏం చేయాలో రాహుల్ గాంధీకి పాలుపోలేదు. ఇంకేముంది తనను చూసేందుకు వచ్చిన పిల్లలతో కలిసి ఆటలాడారు.

Rahul Gandhi Plays Cricket In Haryana

హెలికాప్టర్ రేవారి గ్రౌండ్‌లో దిగడంతో రాహుల్ గాంధీ వారితో కలిసి క్రికెట్ ఆడారు. బ్యాటు ఝులిపిస్తూ.. పిల్లలను ఉత్సాహపరిచారు. రాహుల్ గాంధీకి విద్యార్థులు బౌలింగ్ వేశారు. ఈ క్రమంలో బాల్ బౌండరీకి తరలించేందుకు రాహల్ ప్రయత్నించారు. కవర్ డ్రైవ్ షాట్ కొట్టడంతో అక్కడున్న పిల్లలు కేరింతలు కొట్టారు. తర్వాత చిన్నపిల్లలతో కలిసి ముచ్చటించారు. హెలికాప్టర్ బాగుకాకపోవడం, ప్రతీకూల వాతావరణం నేపథ్యంలో చివరికి ఆయన రోడ్డుమార్గంలో ఢిల్లీకి బయల్దేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+