‘రాహుల్! ఆ 2 రాష్ట్రాల పేర్లు వందసార్లు రాయండి’: బీజేపీ పనిష్మెంట్ అందుకే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ ఓ పనిష్మెంట్ ఇచ్చింది. ఇందుకు ఆయన ట్విట్టర్‌లో చేసిన పొరపాటే కారణం. ఒక రాష్ట్రానికి బదులు మరో రాష్ట్రం పేరు రాసి బీజేపీకి దొరికిపోయిన రాహుల్‌పై బీజేపీ సెటైర్లు వేసింది.

మిజోరాంకు బదులు మణిపూర్..
రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్‌లో ఓ పోస్టులో మిజోరాంకు బదులు మణిపూర్ అని రాశారు. మిజోరాంలో సైనిక్ పాఠశాలలో అర్ధ శతాబ్దం తర్వాత బాలికలకు ప్రవేశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీని గురించి ప్రస్తావిస్తూ మిజోరాంకు బదులుగా మణిపూర్ అని రాశారు.

వ్యంగ్యాస్త్రాలు..
అయితే, ఆ వెంటనే ఆ ట్వీట్‌ను రాహుల్ ఖాతాలో నుంచి తొలగించారు. కానీ, ఆలోపే పలువురు ట్వీట్‌ను స్క్రీన్ షాట్స్ తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఆ పోస్టులపై వ్యంగ్యాస్త్రాలు జోరందుకున్నాయి. కొద్దిసేపటి తర్వాత మిజోరాంగా మార్చి ట్వీట్ చేయడం గమనార్హం.

బీజేపీ పనిష్మెంట్..
కాగా, బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ రాహుల్ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసి ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈశాన్య రాష్ట్రాల గురించి రాహుల్‌కు తెలియకపోవడం సమస్యాత్మకం అని పేర్కొన్నారు. అంతేగాకుండా రాహుల్‌కు పనిష్మెంట్ కూడా ఇచ్చారు.
వందసార్లు రాయండి..
‘రాహుల్ గాంధీ.. ఇది వందసార్లు రాయి ‘మిజోరాం, మణిపూర్ ఈశాన్య భారతదేశంలోని రెండు వేర్వేరు రాష్ట్రాలు. ఈ విషయాన్ని నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం గుర్తుంచుకుంటాను'' అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
Recommended Video

-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications