రోడ్ల మీద గిర్రున తిరిగి సిటీ బస్సులో వెళ్లిన రాహుల్ గాంధీ, అమ్మాయిలతో !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నరాహుల్ గాంధీ అప్పుడప్పుడు సామాన్య ప్రజలతో కలిసి సందడి చేస్తున్నారు. ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ సోమవారం బెంగళూరులో బీఎంటీసీ బస్సులో కొన్ని కిటోమీటర్లు ప్రయాణించి అందరికి షాక్ ఇచ్చారు.

బెంగళూరులోని కన్నింగ్ హ్యామ్ రోడ్డులోకి సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యక్షం అయ్యారు. కన్నింగ్ హ్యామ్ రోడ్డులోని కాఫీ డే ఔట్ లోకి వెళ్లిన రాహుల్ గాంధీ కాఫీ డేలో కాఫీ తాగుతున్న ప్రజలో మాట్లాడారు. కాఫీ డే లో కాఫీ తాగిన రాహుల్ గాంధీ అదే కన్నింగ్ హ్యామ్ రోడ్డులోని బీఎంటీసీ బస్ స్టాప్ దగ్గరకు వెళ్లారు.

Rahul Gandhi

అదే సమయంలో శివాజీనగర్ నుంచి లింగరాజపురం వెలుతున్న బీఎంటీసీ బస్సు రావడంతో టక్కున బస్సు ఎన్నిక రాహుల్ గాంధీ ఆ బస్సులో ఉన్న విద్యార్థులకు, ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. లింగరాజపురం బస్సులో ఉన్న విద్యార్థులు, మహిళలతో మాట్లాడుతూ చాలా దూరం ప్రయాణించిన రాహుల్ గాంధీ సామన్య ప్రజలకు షాక్ ఇచ్చారు.

బెంగళూరులో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి బెంగళూరు వచ్చిన రాహుల్ గాంధీ ఆదివారం డెలవరీ బాయ్ స్కూటర్ మీద ఎక్కి బెంగళూరులోని రెండు కిలోమీటర్లు రౌండ్స్ కొట్టారు. బెంగళూరులోని ఐకానిక్ ఏయిర్ లైన్స్ హోటల్ లో డెలవరీ బాయ్స్ తో కలిసి మసాలా దోసె తిని కాఫీ తాగిన రాహుల్ గాంధీ వారితో చాలా సేపు చర్చించారు.

Rahul Gandhi

ఆదివారం రాత్రి ఆనేకల్ లో జరిగిన బహిరంగ సభలో బీజేపీ మీద రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో సీఎం కుర్చీని రూ. 2, 500 కోట్లకు అమ్మేశారని, ఓ బీజేపీ ఎమ్మెల్యే రూ. 8 కోట్ల నగదుతో అధికారులకు చిక్కిపోయారని, బీజేపీలో ఉన్నంత అవినీతి నాయకులు ఎక్కడా లేరని యువరాజు రాహుల్ గాంధీ బీజేపీ మీద విరుచుకుపడ్డారు.

కర్ణాటకలో 40 శాతం కమీషన్ ప్రభుత్వం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారని, 40 శాతం కమీషన్ లో ఏ ఇంజన్ కు ఎంత కమీషన్ వచ్చిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.

మణిపుర్ రణరంగంగా మారిపోయిందని, అయితే మాకు మణిపూర్ కు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మణిపుర్ ప్రజలను గాలికి వదిలిసేసిన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హ్యాపీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.

బెంగళూరులో సామాన్య ప్రజలతో ఎక్కువగా కలిసిన రాహుల్ గాంధీ, వాళ్లు ఏంపని చేస్తున్నారు, వారి కష్టసుఖాలు ఏమిటి అని తెలుసుకున్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రజల మనిషి కనుక ప్రజల్లో ఉంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రం ప్రజలకు దూరంగా ఉంటారని, ఇక ప్రభుత్వానికి వారు దూరంగానే ఉండటానికి టైమ్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. వందే భారత్ రైళ్ల మీద పదేపదే దాడులు చేస్తున్న వాళ్లు చిక్కితే సినిమా చూపించాలని రైల్వే పోలీసులు వేచి చూస్తున్నారు. వందే భారత్ రైళ్లనే కొందరు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అనే విషయం అంతుచిక్కడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+