చౌకీదార్ చోర్ హై కామెంట్స్..! సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ సారీ

Recommended Video

    Lok Sabha Election 2019 : సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ సారీ || Oneindia Telugu

    ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మెట్టు దిగారు. అమెథీ ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. రాఫెల్ విమానాల కొనుగోళ్లల్లో అక్రమాలు జరిగాయంటూ బీజేపీని ఇరకాటంలో పెట్టాలనుకున్న రాహుల్ గాంధీ.. ప్రచారంలో ప్రధాని మోడీ టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే అదే ఆయనకు రివర్స్ గా మారింది. రాఫెల్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా వ్యాఖ్యానించడటంతో ప్లాన్ బెడిసికొట్టింది. చివరకు న్యాయస్థానానికి సారీ చెప్పాల్సి వచ్చింది.

    లోక్ సభ ఎన్నికల వేళ దేశమంతటా ప్రచారం నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్న రాహుల్ గాంధీ.. ఓ సభలో మోడీని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వ్యాఖ్యలను తప్పుగా పలికారు. 'చౌకీదార్ చోర్ హై' అన్న విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు చెప్పుకొచ్చారు. అయితే దానికి సంబంధించి బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అది విచారించిన న్యాయస్థానం రాహుల్ ను వివరణ కోరింది.

    Rahul Gandhi says sorry to SC for using its name in Chowkidar chor hai comments

    అదలావుంటే రాహుల్ గాంధీ తన తప్పును తెలుసుకున్నారు. ఎన్నికల వేళ ప్రచారంలో తప్పు దొర్లిందని న్యాయస్థానంలో అంగీకరించారు. చౌకీదార్ చోర్ హై అనే విషయం సుప్రీంకోర్టు ఎప్పుడూ ప్రస్తావించలేదన్నారు. ప్రచారంలో తాను అలా మాట్లాడటం కరెక్ట్ కాదని, ఫ్లోలో అలా వచ్చిందని విన్నవించారు. సుప్రీంకోర్టు తన తీర్పులో ఎక్కడా కూడా ఆ విషయం పేర్కొనలేదన్నారు. మొత్తానికి తప్పు తన సైడ్ ఉందంటూ న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+