టాప్ లెవెల్ చోరీ- ఇదే నయా హిందూస్థాన్: పబ్లిక్ ఇంపీచ్‌మెంట్

కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ త్రిలోక్‌పురిలో నిర్వహించిన 'ఓట్ అధికార్.. జీనే కా అధికార్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటర్లతో ముఖాముఖి సమావేశం అయ్యారు. వారి వెతలను ఆలకించారు. సీపీఐ (ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య, స్వరాజ్ ఇండియా ప్రతినిధి యోగేంద్ర యాదవ్ దీనికి హాజరయ్యారు.

దేశంలో అత్యున్నత స్థాయి నుంచే ఓట్ చోరీ జరుగుతోందని, పేద ప్రజలను ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశపూరకంగా తొలగిస్తోన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేవరకు గానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను తొలగించేంత వరకు గానీ ఇండియా బ్లాక్ ఆందోళనలు ఆగబోవని స్పష్టం చేశారు. త్రిలోక్‌పురిలో నాలుగు పోలింగ్ బూత్‌లలోనే ఏకంగా 416 మంది అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని ఆధారాలతో సహా వివరించారు.

Rahul Gandhi says Voting is the right of every citizen and people understood names of poor delate

సామాన్య ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును లాక్కొని, కొద్దిమంది బిలియనీర్ల ప్రయోజనాల కోసం పనిచేసే నయా హిందూస్థాన్ ను నిర్మించేందుకు కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీనిపై ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఈసీ జ్ఞానేష్ కుమార్ దాక్కుంటున్నారని, జవాబుదారీతనం నుంచి తప్పుకొంటోన్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

ఇక తప్పించుకోలేరు: జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ తాజా వ్యూహం: సీడబ్ల్యూసీ భేటీలో..!!
ఇక తప్పించుకోలేరు: జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ తాజా వ్యూహం: సీడబ్ల్యూసీ భేటీలో..!!

నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటోన్నాయని, దీన్ని అడ్డుకోవడానికి ఆందోళనలను మరింత తీవ్రతరం చేయనున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా పబ్లిక్ ఇంపీచ్‌మెంట్ తరహా విచారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు.

టీ20లో టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాప్- భారీ టార్గెట్: న్యూజిలాండ్ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్
టీ20లో టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాప్- భారీ టార్గెట్: న్యూజిలాండ్ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్

రాజ్యాంగం పౌరులకు అందించిన ప్రాథమిక ఓటు హక్కును, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికే ఈ సుదీర్ఘ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది పౌరుల ఓట్లు అన్యాయంగా రద్దవుతున్నాయనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను, రాజ్యాంగబద్ధ సంస్థల స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించే వరకు విపక్షాల నిరసనలు ఆగవని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+