రాహుల్.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రేషన్ కూడా ఇవ్వట్లేదు: కేంద్రమంత్రి హరిసిమ్రత్ బాదల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి హరిసిమ్రత్ బాదల్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీపై మండిపడ్డారు. కేంద్రం పంపించిన రేషన్ సరుకులను కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పంపిణీ చేయలేదని గుర్తుచేశారు.

పంజాబ్ రాష్ట్రంలో కేంద్రం పంపించిన రేషన్ సరుకులు గోదాముల్లో మగ్గుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత జరుగుతుంటే.. రాహుల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముందు అక్కడ చక్కదిద్దుకొని.. జాతీయ నేతగా వ్యవహరించాలని రాహుల్ గాంధీకి సూచించారు.
పంజాబ్లో మంత్రివర్గం గత మూడేళ్లులో భౌతికదూరం పాటిస్తోందని ఆరోపించారు. కరోనా వైరస్ సోకినట్టు.. మంత్రివర్గ సభ్యులు వ్యవహారిస్తున్నారని తెలిపారు. ఫాం హౌస్లో ఉంటూ.. ప్రజలకు దూరంగా ఉన్నారని తెలిపారు. పంజాబ్ రాష్ట్రానికి కేంద్రం 70 వేల మెట్రిక్ టన్నుల రేషన్ అందిస్తే... గత నెలన్నర నుంచి ఒక శాతం కూడా పంపిణీ చేయలేదని విమర్శించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications