వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బావతో కలిసి...: రాహుల్ గాంధీపై మంత్రి తీవ్ర వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రాజకీయాలు వదిలేసి తన బావ రాబర్డ్ వాద్రాతో కలిసి ప్రాపర్టీ డీలర్ షాప్ తెరుచుకోవాలని మండిపడ్డారు.

వాద్రాతో కలిసి తెరచుకునే ప్రాపర్టీ డీలర్ షాప్ పేరును కూడా ఆయనే సూచించారు. ఆ తెరిచే దుకాణానికి.. రాహుల్ అండ్ వాద్రా ప్రాపర్టీ డీలర్స్ అనే పేరు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

'Rahul Gandhi should quit politics, open property dealer shop with Robert Vadra'

అంతకుముందు, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. మంగళవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, కోర్టు మరోసారి వారికి అవకాశం ఇచ్చింది. ఈ నెల 19న కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.

నేషనల్ హెరాల్డ్ గురించి విలేకరులు ఓ ప్రశ్న వేయగా సోనియా గాంధీ మాట్లాడుతూ... తాను ఇందిరా గాంధీ కోడలిని అని, ఎవరికీ భయపడనని చెప్పారు. బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్ామి దాఖలు చేసిన కేసులో సోనియా, రాహుల్‌కు కోర్టు సమన్లు ఇచ్చింది.

English summary
Haryana's Health Minister Anil Vij on sparked a row after he made controversial remarks against Congress vice-president Rahul Gandhi and Robert Vadra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X