వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ పట్టాభిషేకం:వేదికపై సోనియా, మన్మోహన్, శ్రేణుల సంబరం

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాహుల్ పట్టాభిషేకం, వీడియో ! | Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ శనివారం బాధ్యతలు చేపట్టారు. శనివారం ఉదయం 11గంటల ప్రాంతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర సీనియర్ నేతలు వేదికపైకి చేరుకున్నారు. నేతల సమక్షంలో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు.

కాగా, రాహుల్ గాంధీ బాధ్యతల స్వీకరణ వేదిక వద్దకు రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ పెద్దలు, నేతలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు భారీగా నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో సందడి నెలకొంది.

భారీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో వేదిక ప్రాంతంలో తోపులాటకు దారితీసింది. ఆ తోపులాటలో మాజీ స్పీకర్ మీరా కుమార్ కాసేపు చిక్కుకున్నారు.

కార్యాలయానికి వెళ్లే దారి వెంట.. పార్టీ ఆఫీస్‌ బయట రాహుల్‌ గాంధీ పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. శుక్రవారం నుంచే యువ, వివిధ విభాగాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యాక్రమాలతో సందడి నెలకొంది.

 Rahul Gandhi Takes Charge As Congress President From Mother Sonia Today

ఇక రాహుల్‌ గాంధీ ప్రమాణస్వీకార నేపథ్యంలో పలువురు నేతలు ఢిల్లీకి క్యూ కట్టడంతో కోలాహలం నెలకొంది. 2014 ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని తిరిగి పుంజుకునేలా చేస్తాడని సీనియర్లతోసహా అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయమే పార్టీ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలెట్‌ మీడియాతో మాట్లాడారు.

'రాహుల్‌ ఏకగ్రీవ ఎంపిక.. లక్షలాది మంది కార్యకర్తల కోరిక. 2019లో బీజేపీకి పోటీ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో మరింత శక్తితో ముందుకు సాగుతుంది' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోనేగాక, దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

English summary
Congress president-elect Rahul Gandhi will take over as Congress chief today, in place of his mother Sonia Gandhi, a generational shift at the top of India's oldest party that could have trickle-down effects too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X