Rahul Gandhi: ఢిల్లీ-చండీగఢ్ లారీలో ప్రయాణించిన రాహుల్, డ్రైవర్లతో మన్ కీ బాత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్రక్కులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి ఛండీగఢ్‌కు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లాకు వెళ్తున్న రాహుల్.. మార్గమధ్యలో ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించినట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
కాగా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం షిమ్లాలో ఉన్నట్లు తెలిసింది. ఆమెను కలిసేందుకే రాహుల్ వెళుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రయాణం మధ్యలో ట్రక్కు డ్రైవర్లను రాహుల్ కలిశారు. దేశంలో 90 లక్షల మంది ట్రక్కు డ్రైవర్లు ఉన్నారని, వారికి అనేక సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ట్రక్కు డ్రైవర్ల మన్ కీ బాత్‌ను రాహుల్ విన్నారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ నేతలు కూడా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

సోమవారం రాత్రి ట్రక్కులో రాహుల్ గాంధీ తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 4.30 గంటలకు రాహుల్.. అంబాలాలోని ఓ గురుద్వారాకు వచ్చారని స్థానిక పోలీసులు తెలిపారు. అక్కడ ప్రార్థనలు చేసి ట్రక్కు ఎక్కి చండీగఢ్ వైపు వెళ్లిపోయారని చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ లారీలో ప్రయాణించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేతలు రాహుల్ చేసిన పనికి హర్షం వ్యక్తం చేస్తూ రీట్వీట్లు చేస్తున్నారు.
आपके राहुल गांधी, आपके बीच 🚛 pic.twitter.com/E3UntZK82G
— Congress (@INCIndia) May 23, 2023
హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ పీటీఐతో మాట్లాడుతూ.. గాంధీ ట్రక్కు డ్రైవర్లతో ప్రయాణించి, మార్గమధ్యంలో ఆగి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారని చెప్పారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం అధిపతి సుప్రియా శ్రీనాట్ గాంధీ ట్రక్కులో ప్రయాణిస్తున్న, ట్రక్ డ్రైవర్లతో సమావేశమైన చిత్రాలను పంచుకున్నారు.
जननायक @RahulGandhi जी ट्रक ड्राइवर्स की समस्या जानने उनके बीच पहुंचे।
— Congress (@INCIndia) May 23, 2023
राहुल जी ने उनके साथ दिल्ली से चंडीगढ़ तक का सफर किया।
मीडिया रिपोर्ट्स के मुताबिक, भारत की सड़कों पर करीब 90 लाख ट्रक ड्राइवर्स हैं। इनकी अपनी समस्याएं हैं। इनके 'मन की बात' सुनने का काम राहुल जी ने किया। pic.twitter.com/Bma2BCjGpY
'రాహుల్ గాంధీ భిన్నమైన వ్యక్తి. ఈ రోజు ఈ దేశంలో సాధారణ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ వేడిలో, రాత్రంతా ట్రక్కు డ్రైవర్లతో కూర్చుని వారి సమస్యలను విన్నారు. వారికి భరోసా కల్పించారు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications