పరువునష్టం కేసు: గుజరాత్ కోర్టులో రేపు సవాల్ చేయనున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: తనపై గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాలు చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు రాహుల్ సోమవారం(ఏప్రిల్ 03న) సూరత్ సెషన్స్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
అంతేగాక, న్యాయ నిపుణులతో కలిసి ఇప్పటికే పిటిషన్‌ను తయారు చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో తనని దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్ తన వ్యాజ్యంలో కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెషన్స్ కోర్టులో దీనిపై తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం.

మోడీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం(క్రిమినల్) కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం వెంటనే అనర్హత వేటు వేసింది. ఏప్రిల్ 22లోగా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ ఆందోళనల్లో కలిసి పాల్గొన్నాయి.
ఇది ఇలావుండగా, రాహుల్ గాంధీపై తాజాగా మరో పరువునష్టం కేసు దాఖలైంది. ఆర్ఎస్ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కోర్టులో రాహుల్‌పై ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా పిటిషన్ వేశారు . 2023 జనవరి 9న హర్యానాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)ను ఉద్దేశించి విమర్శలు చేశారు. 21వ శతాబ్ధానికి చెందిన కౌరవులు ఖాకీ నిక్కరు ధరించి శాఖలు నడుపుతున్నారని వ్యాఖ్యానించారు రాహుల్. కాగా, ఈ కేసుపై ఏప్రిల్ 12న విచారణ జరగనుంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications