ఢిల్లీ దిగ్బంధం వేళ.. చెన్నైలో రాహుల్ గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజధాని చెన్నైలో ల్యాండ్ అయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఛాంత్రోం కీ గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. అంతకంటే ముందు ముఖ్యమంత్రి విజయ్ ను కలుసుకోనున్నారు. ఆయనతో కలిసి భోజనం చేయనున్నారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చెన్నై రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ ముందుగా గిండిలోని ఓ హోటల్‌కు వెళ్తారు. అక్కడ విశ్రాంతి తీసుకున్న అనంతరం నీలాంగరైలో విజయ్ నివాసానికి చేరుకుంటారు. గత మే నెలలో ముఖ్యమంత్రిగా విజయ్ అధికార బాధ్యతలు స్వీకరించడం, సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్ ఆవిర్భవించిన అనంతరం మొదటిసారిగా ఈ భేటీ ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

Rahul Gandhi to Meet Tamil Nadu CM Vijay at Neelankarai in Chennai Before Students Chhatron Ki Goonj

ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన తర్వాత ఐలాండ్ గ్రౌండ్స్‌లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నిర్వహించే ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారు. ఈ వేదికపై ముందస్తుగా క్యూఆర్ కోడ్ పొందిన దాదాపు 10,000 నుండి 20,000 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సాధారణ ప్రజలకు ప్రవేశం లేకుండా ప్రత్యేక కేటగిరీ కారిడార్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంప్రదాయ రాజకీయ ఉపన్యాసాలకు భిన్నంగా, విద్యార్థులే నేరుగా లోక్‌సభ ప్రతిపక్ష నేతను ప్రశ్నించేలా ఈ సదస్సును రూపకల్పన చేసింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. నీట్ పరీక్ష విధానం, ఉద్యోగ అవకాశాల కొరత, మహిళా విద్య, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై విద్యార్థుల సందేహాలకు రాహుల్ సమాధానాలు ఇస్తారు. విద్యా కేంద్రమైన చెన్నైలో జెన్ జీ యువతను ఆకట్టుకునేలా యు టాక్.. రాహుల్ లిజన్స్ అనే నినాదంతో టీపీసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

చెన్నై పర్యటన ముగించుకుని రాత్రి 8:30 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ ఐలాండ్ గ్రౌండ్స్ నుంచి బయలుదేరి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 9:40 గంటలకు బయలుదేరే విమానంలో ఆయన తిరిగి న్యూఢిల్లీకి పయనమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+