రాహుల్ గాంధీ 2.0..! ఇప్పుడు ఎంజాయ్ మూడ్‌: మొన్న సినిమా.... నిన్న దోశ...!!

మాజీ ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి నుండి పాఠాలు నెర్చుకుంటున్నాడు. వందేళ్ల పార్టీ తన సారధ్యంలో కుప్పకూలిపోవడంతో తిరిగి సాధరణ ప్రజలకు చేరువయ్యోందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలోనే పార్టీ అధ్యక్ష పదవి రాజీనామ చేసిన ఆయన, హంగు ఆర్భాటాలను వదిలి ఓ సాధరణ కార్యకర్తగా ప్రజల మధ్య ఉండేందుకు ఇష్టపడుతున్నాడు.

ఈనేపథ్యంలోనే గత వారం రోజుల క్రితం ఓ సాధారణ పౌరుడిలా వెళ్లి ఢిల్లీలోని మల్టిపెక్స్‌లో అందరి ప్రేక్షకుల మధ్య కూర్చోని సినిమా చూశాడు.అందరితోపాటు పాప్‌కార్న్ తినుకుంటూ ఎంజాయ్ చేశాడు.ఇక తాజగా మరోసారి పార్టీ నేతల మధ్య కూర్చుని ఓ రెస్టారెంట్‌లో టిఫిన్ చేశాడు.శనివారం పాట్నా కోర్టుకు హజరై తిరిగి వెళ్తున్న సంధర్భంలో ఓ రెస్టారెంట్‌లోకి వెళ్లాడు. సెక్యూరిటి లేకుండా రెస్టారెంట్‌లోకి వెళ్లిన రాహుల్ దోశ తిన్నాడు. అనంతరం కాఫి తాగి బయటికి వచ్చాడు..

 Rahul Gandhi visited a restaurant feasted on South Indian speciality dosa for lunch

దీంతో రాహుల్ గాంధీతోపాటు హోటళ్లో టిఫిన్ చేస్తున్న వారు ఫోటోలను క్లిక్‌మనిపించి సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు అమేధి నుండి ప్రాధినిధ్యం వహించిన రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో కేరళలోని వయానాఢ్ నుండి పోటి చేసి గెలిచిన విషయం తెలిసిందే. దీంతో సౌత్ ఇండియా ఫేమ్ అయినా దోశ తినడంతోపాటు పార్టీ ఓటమి తర్వాత ప్రజలకు దగ్గరయ్యోందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నలు నెటిజన్ల మన్నన్నలు పోందుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+