వయనాడ్‌ను వదులుకున్న రాహుల్: అక్కడ్నుంచే బరిలో ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. లోక్‌సభ స్థానాలు కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఆయన గెలుపొందారు. వీటిలో ఏ స్థానాన్ని వదులుకుంటారనేది ఇప్పటి వరకు ఉత్కంఠగా సాగింది. తాజాగా, ఈ విషయంలో రాహుల్ నిర్ణయం ప్రకటించారు.

వయనాడ్ ఎంపీ సీటును రాహుల్ వదులుకున్నారు. రాయ్‌బరేలీ ఎంపీగా తాను కొనసాగనున్నట్లు రాహుల్ స్పష్టం చేశారు. వయనాడ్ స్థానాన్ని వదులుకోవడానికి ఎంతో మదనపడ్డానని, అక్కడి ప్రజలతో నా బంధం కొనసాగుతుంది అని రాహుల్ స్పష్టం చేశారు. కాగా, వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని నిర్ణయించామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

Rahul gave up Wayanad Priyanka Gandhi to contest from there

అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తుండటం ప్రియాంక గాంధీకి ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో ఈ స్థానానికి త్వరలోనే ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

'వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, రాహుల్ గాంధీ లేరనే పరిస్థితి కల్పించను' అని ప్రియాంక ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విషయమై సోమవారం కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. రాహుల్​ గాంధీని పార్లమెంట్​లో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలా వద్దా? అనే విషయంపైనా చర్చించినట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు.

రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ స్థానంలో కొనసాగుతుండటం మంచి విషయమన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. అలాగే ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీలో దిగుతుండటం స్వాగతించదగినదని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+