ఐదు పాస్ కాని సోనియా, రాహుల్ ఎం.ఫూల్(పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ గాంధీ కుటుంబ సభ్యుల పైన బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ప్రియాంక గాంధీని తాగుబోతుగా విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ను 'ఫేక్' అంటూ తూర్పారబట్టారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి ఎంఫిల్‌లో పాస్ కాకపోయినా, అయినట్టు తన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని తీవ్ర విమర్శ చేశారు.
విద్యార్హతపై ఈసిని తప్పుదోవ పట్టించిన నేత.. రేపు ప్రధానమంత్రి అయితే దేశాన్ని ఇంకెంత మోసగిస్తారోనని ఘాటుగా వ్యాఖ్యానించారు. నెహ్రూ కుటుంబంలో ఎవరు కూడా గ్రాడ్యుయేట్లు లేరన్నారు.

సుబ్రహ్మణ్య స్వామి
గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంబ్రిడ్జ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌కు వెళ్లి విచారించానని, రికార్డులో రాహుల్ గాంధీ పేరు లేదన్నారు.

సుబ్రహ్మణ్య స్వామి
రాహుల్ విన్సి అనే పేరు కనిపించిందని, ఆ పేరుగల వ్యక్తి ఎంఫిల్ పరీక్ష రాశారని, కోర్సులోని నేషనల్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ పేపర్‌లో ఫెయిలయ్యారని వివరించారు.

సుబ్రహ్మణ్య స్వామి
కానీ, అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేస్తూ.. ఈసికి సమర్పించిన అఫిడవిట్‌లో ఎం.ఫిల్ పూర్తి చేసినట్టు తప్పుడు ద్రువీకరణ పత్రాన్ని రాహుల్ సమర్పించారని ఆరోపించారు.

సుబ్రహ్మణ్య స్వామి
నెహ్రూ కుటుంబం నుంచి ఎవరికీ డిగ్రీ సర్టిఫికెట్ లేదని, సోనియాగాంధీ ఐదో తరగతి కూడా పాస్ కాలేదన్నారు. కానీ, ఆమె కేంబ్రిడ్జిలో ఇంగ్లీష్ లో గ్రాడ్యుయేషన్ చేసినట్లు చెప్పారన్నారు. సోనియా తనయ ప్రియాంకా గాంధీ వ్యక్తిగత విషయాలపై తాను ఆరోపణలు చేస్తున్నానంటున్న కాంగ్రెస్ నేతలు.. వ్యక్తిగతం అంటే ఏమిటో చెప్పాలన్నారు.

సుబ్రహ్మణ్య స్వామి
రూ.5 లక్షలు.. రూ.5వేల కోట్లు ఏమయ్యాయని, దేశ ఆస్తులు లూటీ చేసి.. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేవయద్దంటారా అని ఘాటుగా ప్రశ్నించారు.

సుబ్రహ్మణ్య స్వామి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మంచి శుభ పరిణామని, ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కెవపి కేసు తనకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications