రాహుల్‌గాంధీకి షాక్‌పై కాలేజ్ అమ్మాయి లెటర్.. ఇదే
బెంగళూరు: రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఓ మహిళా కళాశాలలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి చుక్కెదురైన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్, ఉద్యోగాలు తదితర అంశాల పైన కాలేజ్ అమ్మాయిలు యువనేతకు షాకిచ్చారు.
అయితే, రాహుల్ గాంధీకి కళాశాలలో ఎలాంటి షాక్ ఎదురు కాలేదని ఆ కాలేజీకి చెందిన అమ్మాయి ఓ ఓపెన్ లెటర్ సామాజిక అనుసంధాన వేదికల్లో ఉంచింది. బెంగళూరులోని ప్రముఖ మౌంట్ కార్మెల్ కళాశాల విద్యార్థినులతో రాహుల్ బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ విజయవంతమైందా అని ప్రశ్నిస్తే... అమ్మాయిల నుంచి 'అవును' అని సమాధానం వచ్చింది. ఉద్యోగాలు వస్తున్నాయా అని ప్రశ్నిస్తే 'అవును' అని ఎక్కువ మంది నుంచి సమాధానం వచ్చింది. దీంతో అవాక్కవడం రాహుల్ గాంధీ వంతయింది.

అయితే, ఇదంతా నిజం కాదని, అక్కడ జరిగిన దాని కంటే ఎక్కువ చేసి చెబుతున్నారంటూ అదే కళాశాలకు చెందిన ఎలిగ్జిర్ నహర్ పేర్కొన్నారు. ఆమె ఓ లేఖ రాసి, దానిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 1,437 పదాలు ఉన్న ఈ లేఖలో రాహుల్ వేసిన ప్రశ్నలు, వాటికి విద్యార్థులు స్పందించిన తీరు రాశారు.
రాహుల్ ప్రశ్నలకు మిశ్రమ స్పందన వచ్చిందని, ఆయన చాలా సరదాగా మాట్లాడారని ఆమె తెలిపారు. కేవలం స్వచ్ఛ భారత్ పైనే కాకుండా మేకిన్ ఇండియా పైన రాహుల్ ప్రశ్నలు వేశారని చెప్పారు.
దీనికీ మిశ్రమ స్పందనే వచ్చిందని, మేక్ ఇన్ ఇండియా ద్వారా మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని మీరు నమ్ముతున్నారా? అనే ప్రశ్నకు చాలా మంది విద్యార్థినులు ‘నో' అనే సమాధానం చెప్పారని పేర్కొన్నారు. అయితే, మొత్తానికైతే రాహుల్‌కు చేదు అనుభవం ఎదురైందని ఆమె లెటర్ ద్వారా కూడా అర్థమవుతోంది.
An Open Letter to #RahulStumped Enthusiasts Those ‘No Ragging’ posters you vaguely see around educational institutions...
Posted by Elixir Nahar on Wednesday, November 25, 2015
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications