రాహుల్ తప్పుడు భాషకు జవాబు చెప్పను: సుష్మా, భర్తలపై మహిళలకు డొక్లాం పాఠం!
డోక్లామ్ విషయంలో చైనాతో భారత్ అనుసరించిన విధానాన్నే భర్తల విషయంలోనూ అనుసరించాలని విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ మహిళలకు పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: డోక్లామ్ విషయంలో చైనాతో భారత్ అనుసరించిన విధానాన్నే భర్తల విషయంలోనూ అనుసరించాలని విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ మహిళలకు పిలుపునిచ్చారు.

ఉద్యోగం చేసేందుకు ఫ్యామిలీ ఒప్పుకోకుంటే
బిజెపి ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో నిర్వహించిన మహిళా సమ్మేళనంలో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడారు. ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పకోకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు.

డొక్లాంలో భారత్ అనుసరించిన వైఖరి
ఆ మహిళకు సుష్మా స్వరాజ్ సమాధానం చెప్పారు. ఉద్యోగం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తొలుత వారికి వివరించాలని, అప్పటికీ వినకపోతే డోక్లామ్ విషయంలో చైనాపై భారత్ అనుసరించిన శాంతియుత విధానాన్ని అనుసరించి దారికి తెచ్చుకోవాలని నవ్వుతూ చెప్పారు.

శాంతియుతంగా డొక్లామ్ సమస్య పరిష్కారం
ఈ సందర్భంగా డోక్లామ్ విషయంలో భారత్-చైనా దేశాల మధ్య రెండు నెలలపాటు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి వివరించారు. చివరికి శాంతియుతంగా సమస్య పరిష్కారమైందన్నారు. మహిళలకు భద్రత, స్వేచ్ఛ, సాధికారత చాలా ముఖ్యమన్నారు.

రాహుల్ తప్పుడు భాషకు సమాధానం చెప్పే ప్రసక్తి లేదు
ఆరెస్సెస్‌లో మహిళలు నిక్కర్లు ధరించడం చూశారా? అన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుష్మ స్పందించారు. ఆరెస్సెస్‌లోని మహిళలు నిక్కర్లు ఎందుకు ధరించరని రాహుల్ సూటిగా అడిగి ఉంటే సమాధానం చెప్పి ఉండేదాన్ని అని సుష్మ అన్నారు. ఆయన అలా ప్రశ్నించడం సరికాదని, తప్పుడు భాష ఉపయోగించిన ఆయనకు బదులిచ్చే ప్రసక్తే లేదన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications