రాహుల్ పెళ్లి చేసుకో.. రాటుదేలుతావ్..!

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్.. పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేందుకు రాహుల్ సిద్ధమైనా హైకమాండ్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో రాహుల్ నాయకత్వం, పార్టీ పటిష్టతపై ప్రతిపక్ష నేతలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి రామ్‌దాస్ అతావలే కాంగ్రెస్ బలోపేతానికి రాహుల్‌కు ఓ సలహా ఇచ్చారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లోపు రాహుల్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలంటే ముందు ఆయన పెళ్లి చేసుకోవాలని అతావలే అడ్వైజ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధించేందుకు ఏం చేయాలన్న విలేకరుల ప్రశ్నపై స్పందించిన ఆయన ఈ సమాధానం చెప్పారు. పెళ్లి చేసుకుంటే రాహుల్ మరింత రాటుదేలుతారని అతావలే అభిప్రాయపడ్డారు. రాహుల్ తనకు స్నేహితుడైనందునే ఈ సలహా ఇస్తున్నానని చెప్పారు.

Rahul should get married to become stronger says athawale

గతంలో పెళ్లి గురించి రాహుల్‌ వద్ద ప్రస్తావించగా.. కాంగ్రెస్ పార్టీతో తన వివాహం జరిగిపోయిందని చెప్పారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం రాహుల్ గాంధీ శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయితే మోడీ ప్రభంజనంతో కాంగ్రెస్ కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2014తో పోలిస్తే ఈసారి ఆ పార్టీకి స్వల్ప సంఖ్యలో సీట్లు పెరిగాయి. అయితే కనీసం ప్రతిపక్ష హోదా సాధించే స్థాయిలో కాంగ్రెస్ సీట్లు సాధించకపోవడం గమనార్హం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+