రైల్లో మంటలు: బోగీలోంచి తెగించి దూకేశారు
అనంతపురం: ప్రాణాలను కాపాడుకునేందుకు మంటలు అంటుకున్న నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలోంచి ప్రయాణికులు తెగించి కిందికి దూకేశారు. ప్రాణాలను కాపాడుకోవడానికి కొంత మంది రైలులోంచి కిందికి దూకేస్తే, మరికొంత మంది బాత్రూం అద్దాలు పగులుగొట్టి బయటకు వచ్చారు.
బోగీలోంచి దూకేయడంతో పలువురు గాయపడ్డారు. కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. కొద్ది మంది మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. గాయపడినవారిని ధర్మవరం, అనంతపురం, పెనుగొండ, పుట్టపర్తి ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారిలో తనుశ్రీ అనే చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బంధువుల రోదనలతో అస్పత్రులు శోకసముద్రంలా మారిపోయాయి.
కాగా, శ్రీలత, ఆమె భర్త శ్రీనివాస్ అచూకీ తెలియకపోవడంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి సెల్ ఫోన్లు పనిచేయడం లేనది చెబుతున్నారు. వారికి ఆరు నెలల క్రితమే పెళ్లయింది. వారు అనంతపురం జిల్లాకు చెందినవారు.

ఇదిలావుంటే, ఓ వ్యక్తి ప్రమాదంలో తనవారందరినీ కోల్పోయి కూడా పలువురి ప్రాణాలు కాపాడాడు. శ్రవణ్ అనే వ్యక్తి తన భార్యను,త అత్తను, మామను కోల్పోయాడు. కళ్ల ముందే వారు బుగ్గిపాలయ్యారు. అయినా దుఖ్కాన్ని దిగమింగుతూ తోటి ప్రయాణికులను కాపాడడంలో మునిగిపోయాడు. దాదాపు 20 మంది ప్రాణాలను అతను కాపాడినట్లు వార్తలు వస్తున్నాయి.
రైలు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన సంతాప సందేశాన్ని ట్వీట్ చేశాడు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Nanded-Banglore express fire claims 26 lives. My condolences to the families of deceased. So many accidents this year, sad & shocking.</p>— N Chandrababu Naidu (@ncbn) <a href="https://twitter.com/ncbn/statuses/416802696113311744">December 28, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications