వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్: ప్రత్యేకతలు ఇవే: హాట్ వాటర్ కూడా

Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 54 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

Railway Minister Ashwini Vaishnaw conducts an inspection of Vande Sleeper Coach in Bengaluru

ప్రయాణికుల నుంచి లభిస్తోన్న అపూర్వ ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌లో కీలక మార్పులను తీసుకుని రానుంది. వారికి మరింత అనుకూలంగా తీర్చిదిద్దుతోంది. కొత్తగా స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు.. బెంగళూరు తిప్పసంద్రలో గల భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో తుదిరూపాన్ని దిద్దుకుంటోన్నాయి. ఈ బోగీలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఉదయం పరిశీలించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి వీ సోమన్నతో కలిసి సందర్శించారు. సాంకేతికాంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Railway Minister Ashwini Vaishnaw conducts an inspection of Vande Sleeper Coach in Bengaluru

మొత్తం 16 కోచ్‌లు ఉండే రైలు ఇది. ఇందులో 613 బెర్తులతో 11 ఏసీ 3-టయర్ కోచ్‌లు, 188 బెర్తులతో నాలుగు ఏసీ 2- టయర్ కోచ్‌లు, 24 బెర్తులతో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రైలు తుదిరూపాన్ని సంతరించుకుంటోంది బీఈఎంఎల్‌లో.

జీఎఫ్ఆర్‌పీ ప్యానెళ్లు, ఆటోమేటిక్ ఎక్స్‌టీరియర్ పాసింజర్ డోర్లు, సెన్సర్ ఆధారంగా పని చేసే ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, అత్యాధునిక సదుపాయాలను కలిగివుండటం ఈ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత. ప్రతి బెర్త్‌కూ యూఎస్‌బీ ఛార్జింగ్ పిన్, రీడింగ్ బల్బ్, దివ్యాంగులకు ప్రత్యేక బెర్తులు- టాయ్‌లెట్లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, ఇన్‌సైడ్ డిస్‌ప్లే ప్యానెల్స్, సెక్యూరిటీ కెమెరాలు, ఫస్ట్ క్లాస్ ఏసీలో హాట్ వాటర్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+