క్షణాల్లో మహిళను కాపాడిన రైల్వే పోలీస్ (వీడియో)
రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. ఇక కదులుతున్న రైలులోంచి ఎక్కడం గానీ, దిగడం గానీ చేయకుంటేనే మంచిది. లేదంటే అనుకోని ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది. తాజాగా, ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఓ రైల్వే పోలీసు సమయానికి స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రంలోని ముంబై బోరివలి స్టేషన్‌లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వీడియోను భారత రైల్వే మంత్రిత్వశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రైల్వే పోలీసు చేసిన సాయాన్ని 'మిషన్ జీవన్ రక్ష'గా అభివర్ణించింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. సదరు పోలీసు అధికారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మహారాష్ట్రంలోని బోరివలి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ఓ మహిళ అదుపుతప్పి రైలు-ప్లాట్ ఫాంకు మధ్య పడిపోయింది. అక్కడేవున్న రైల్వే పోలీసు అధికారి వేగంగా స్పందించాడు. క్షణాల్లో ఆమెను ప్లాట్ ఫాంపైకి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. సదరు అధికారి చర్య అభినందనీయమని రైల్వే శాఖ పేర్కొంది.
महाराष्ट्र के बोरीवली रेलवे स्टेशन पर एक महिला चलती ट्रेन से उतरते समय असंतुलित होकर गिर पड़ी। वहां मौजूद रेलवे सुरक्षाकर्मी ने तत्परता दिखाते हुए उसे बचा लिया।
— Ministry of Railways (@RailMinIndia) March 9, 2025
कृपया चलती ट्रेन से चढ़ने या उतरने की कोशिश न करें।#MissionJeevanRaksha pic.twitter.com/6R8FALdD0d
ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని రైల్వే శాఖ పేర్కొంది. కాగా, ఫిబ్రవరి నెలలో కూడా ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి రెండు బ్యాగులు మోసుకుంటూ.. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు అతడ్ని కాపాడారు. ఇలా రైల్వే పోలీసులు చాలా సార్లు ప్రయాణికులను సురక్షితంగా ప్రమాదాల నుంచి బయటపడేశారు.












Click it and Unblock the Notifications