ఈ మధ్యాహ్నం నుంచి ఢిల్లీకి వెళ్లే అన్ని రైళ్లు రద్దు- రైల్వే శాఖ సంచలన నిర్ణయం..!!
రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఆందోళనకు పిలుపు ఇవ్వటంతో రైల్వే శాఖ ఢిల్లీకి వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ప్రయాణీకులకు కీలక సమాచారం అందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా ఢిల్లీలో రేపు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగా లను ఢిల్లీలో మొహరించారు.
రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు నిర్ణయించారు. ఓటర్ల జాబితాల సవరణలోని అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇదే డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ సైతం రోడ్డెక్కుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో రేపు ఢిల్లీకి వెళ్లే రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరే రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

CJP నిరసనల వేళ రైల్వే శాఖ నిర్ణయం
కాగా.. రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు చేరుకునే రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సీఈసీ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ ఆందోళన కొనసాగిస్తోంది. ఢిల్లీలో ఎలాంటి ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. జంతర్‌మంతర్ వద్ద ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో 20 వేల మందికి పైగా పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. కాగా.. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, న్యూఢిల్లీ, కాశ్మీరీ గేట్ వంటి 57 మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ గేట్లపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలను బంద్ చేసారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. దీంతో.. ఢిల్లీలో రేపు (శనివారం) చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
