అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల కోసం కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రైల్వే శాఖ
హైదరాబాద్: రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ టికెట్లను పొందేందుకు రైల్వే శాఖ ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను బుధవారం ప్రారంభించింది. ముంబైలోని సబర్బన్ రైల్వే సెక్టారులో పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదగా ప్రారంభించారు.
ఈ యాప్‌తో అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్ కోసం ప్రయాణికులు ఇక గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ముందుగా టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే అప్పటికప్పుడు ప్రయాణాలకు సిద్ధమైన ప్రయాణీకులు ఈ కొత్త మొబైల్ యాప్ ద్వారా సులభంగా టిక్కెట్లను పొందవచ్చు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాగిత రహిత టికెట్ సదుపాయం కోసం ఈ అప్లికేషన్‌ను రూపొందించినట్లు రైల్వే శాఖ అధికాలు తెలిపారు. రైలులో ఎక్కిన తర్వాత టీసీలకు మొబైల్‌లోని ఐడీ నెంబర్ చూసిప్తే సరిపోతుంది.
మొబైల్ యాప్‌ను ఈ లింక్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి
ఈ మొబైల్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది?
స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్వే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రైల్వే ఇ-వాలెట్ కోసం వినియోగదారుడికి రిజిస్ట్రేషన్ ఐడీ నంబరు వస్తుంది. వినియోగదారుడు రిజిస్ట్రేషన్ చేయించుకొన్న తర్వాత వారి వివరాలు ఇ-వ్యాలెట్‌లో నమోదవుతాయి. టికెట్ల కొనుగోలు సొమ్మును ఇ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications