Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టీమ్ ఇంజిన్.. అదో ఎమోషన్: మళ్లీ పట్టాలపైకి

చెన్నై: రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నడిపిస్తోన్న హెరిటేజ్ రైళ్లు- ఇక సరికొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. హెరిటేజ్ రైళ్ల కోసం కొత్తగా స్టీమ్ ఇంజిన్లను వినియోగించనుంది రైల్వే మంత్రిత్వ శాఖ. స్టీమ్ ఇంజిన్ కాన్సెప్ట్‌తో వాటిని ప్రత్యేకంగా పట్టాలపైకి తీసుకుని రానుంది. ఇది ఆవిరి పనిచేయకపోయినప్పటికీ- అదే థీమ్‌తో నడుస్తుంది.

ఎలక్ట్రిక్ రైలింజిన్లను ఈ స్టీమ్ లోకో ఇంజిన్ తరహాలో డిజైన్ చేశారు. ఈ ప్రత్యేక రైలులో మూడు ఎయిర్ కండిషన్డ్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు, ఒక ఎయిర్ కండిషన్డ్ ప్యాంట్రీ, రెస్టారెంట్ కార్ ఉంటాయి. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, రైల్వే బోర్డ్‌ సహకారంతో దక్షిణ రైల్వే కోచ్‌ షెడ్‌లో దీన్ని రూపొందించారు.

Railways to introduce steam engines concept for Heritage special trains

చెన్నై గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్, తిరుచిరాపల్లి, పెరంబూర్‌లల్లో ఈ స్టీమ్ లోకో తరహాలో ఎలక్ట్రిక్ ఇంజిన్లను తయారుచేశారు. ఈ ప్రత్యేక రైలును మొదట హెరిటేజ్ మార్గాల్లో ప్రవేశపెట్టడానికి రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తోన్నారు. రెండు, మూడు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

తొలి దశలో హెరిటేజ్ రూట్లల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తారు. దాని పనితీరును పరిశీలించిన అనంతరం ఇతర మార్గాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వే, మాథేరాన్ హిల్ రైల్వే, నీలగిరి మౌంటెయిన్ రైల్వే, కలకత్తా ట్రామ్‌వేస్ కంపెనీ, పాలెస్ ఆన్ వీల్స్ ట్రైన్ సర్వీసులను హెరిటేజ్ రూట్లుగా పరిగణిస్తోన్నారు.

Railways to introduce steam engines concept for Heritage special trains

ఈ కొత్త స్టీమ్ లోకో ఇంజిన్‌లను వాటికి వినియోగించడం వల్ల హెరిటేజ్ మార్గాలకు సరికొత్త అందాన్నితీసుకొస్తాయని అధికారులు భావిస్తోన్నారు. తేలికపాటి రైళ్లే కావడం వల్ల ఆయా మార్గాల్లో సులువుగా అవి రాకపోకలు సాగించగలుగుతాయని చెబుతున్నారు. వాటి సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం ఇతర మార్గాల్లో ప్రవేశపెట్టొచ్చని స్పష్టం చేస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+