విమానాల వలే త్వరలో రైళ్లలోను బ్లాక్ బాక్స్! అభివృద్ధి దశలో ఉంది
న్యూఢిల్లీ: విమానాల్లో బ్లాక్ బాక్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. త్వరలో భారతీయ రైల్వేల్లోను బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ప్రమాదాల విచారణ, సిబ్బంది పర్‌ఫార్మెన్స్ తదితర వివరాలు తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.
రైళ్లలో లోకో క్యాబ్ వాయిస్ రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో విమానాల్లో వలె రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ఏర్పాటు చేస్తారు. విచారణ సమయంలో వాటి ద్వారా ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలను, సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కూడా సహకరిస్తుంది.

ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. అయితే అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు చెప్పారు. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు ఏవి ప్రమాదానికి కారణమో తెలుసుకోవడానికి ఈ వీడియో లేక వాయిస్ రికార్డింగ్ వ్యవస్థలు ఉపయోగపడతాయి.












Click it and Unblock the Notifications