బెంగళూరు కూల్ కూల్: మరో రెండు రోజులు వర్షాలు, ప్రజలు హాయిగా, ట్రాఫిక్ జామ్!
బెంగళూరు: బెంగళూరు నగరంలో గత నెల రోజుల నుంచి వాతావరణంలో భారీగా మార్పులు వస్తున్నాయి. బుధవారం వేకువ జామున నుంచి రాత్రి బెంగళూరులో వాతావరణం పూర్తిగా మారిపోయింది. బెంగళూరు నగరంలో అక్కడక్కడా వర్షం పడింది. చల్లటి వాతావరణంతో ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం రాత్రి వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మరో రెండు రోజులు బెంగళూరు నగరంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. రెండు రోజుల పాటు సాయంత్రం లేదా రాత్రి బెంగళూరులో వర్షం పడే అవకాశం ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం గరిష్ట ఉష్ణోగ్రత 29 సెంటీ గ్రేడ్ డిగ్రీలు, కనిష్ట్ర ఉష్ణగ్రత 19 సెంటీ గ్రేడ్ డిగ్రీలు ఉంది.

బెంగళూరు నగరంలో గరిష్ణ ఉష్ణోగ్రత 30 సెంటీ గ్రేడ్ డిగ్రీలు, కనిష్ణ ఉష్ణోగ్రత 19 సెంటీ గ్రేడ్ డిగ్రీలు ఉంది. బుధవారం బెంగళూరు నగరంలోని ఎక్కువగా సారక్కిలో 25 మి, మీ వర్షం పడింది. తావరకెరెలో 16.5 మి.మీ, బిదరహళ్ళిలో 20 మి.మీ, కోణనెకుంటలో 10.5 మి,మీ, బ్యారాయణపురలో 11 మి,మీ, కోరమంగల 8 మి.మీ, బీటీఎం లేఔట్ 7.5 మి.మీ, మండూరులో 12 మి.మీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications