చెన్నైని కరుణించని వరుణుడు (ఫోటోలు)

చెన్నై: చెన్నై ప్రజల మీద వరుణ దేవుడు కురుణించడం లేదు. చెన్నై నగరంలో బుధవారం తెల్లవారుజాము నుంచి మళ్లి వర్షాలు మొదలైనాయి. చాల రోజుల తరువాత సూర్యుడు కనిపించాడని సంబరపడిన ప్రజలు కొన్ని గంటలకే హడలిపోయారు.

చెన్నై నగరంలో పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. చాల ప్రాంతాల్లో ఓ మోస్తారు వరకు వర్షాలు పడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెలుతున్నారు.

దక్షిణ తమిళనాడులోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 8 జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది.

రైళ్లు రద్దు

రైళ్లు రద్దు

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తో సహా దూర ప్రాంతాలకు వెళ్లే ఏడు రైళ్లు రద్దు చేస్తున్నామని దక్షిణ మద్య రైల్వే అధికారులు తెలిపారు.

బస్సు సర్వీసులు అంతంత మాత్రమే

బస్సు సర్వీసులు అంతంత మాత్రమే

దూర ప్రాంతాల నుంచి చెన్నై నగరానికి అంతంతమాత్రంగానే బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

ఇంటర్ స్టేట్ సర్వీసులు నిల్

ఇంటర్ స్టేట్ సర్వీసులు నిల్

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్లే అంతరాష్ట్ర బస్సు సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.

సహాయక చర్యలు

సహాయక చర్యలు

తమిళ సినీరంగానికి చెందిన ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలతో పాటు కళాకారులు సహాయక చర్యల్లో పాల్గోంటున్నారు.

అయినా ధరలు తగ్గలేదు

అయినా ధరలు తగ్గలేదు

చెన్నై నగరంలో గత రెండు రోజుల నుంచి వర్షం తగ్గింది. అయినా నిత్యవసర వస్తువుల ధరలు మాత్రం తగ్గడం లేదు.

ఆహారం, నీరు బాటిల్స్ పంపిణి

ఆహారం, నీరు బాటిల్స్ పంపిణి

పలు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు స్వయంగా చెన్నై నగరంలోని వివిద ప్రాంతాల్లో సంచరించి వరద బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ పంపిణి చేస్తున్నారు.

రంగంలోకి అధికారులు

రంగంలోకి అధికారులు

చెన్నై నగరంలో నిలిచిపోయిన వరద నీటిని తరలించడానికి అధికారులు రంగంలోకి దిగారు.

కార్పొరేషన్ సిబ్బందికి నో లీవ్

కార్పొరేషన్ సిబ్బందికి నో లీవ్

చెన్నై కార్పొరేషన్ లో ఉద్యోగం చేస్తున్న అధికారులు, సిబ్బందికి సెలవులు ఇవ్వడం లేదు. చెన్నై నగరం కుదటపడే వరకు విధులలో ఉండాలని ప్రభుత్వం సూచించింది.

సర్వం కొల్పోయారు

సర్వం కొల్పోయారు

చెన్నై నగరంలోని పలు ప్రాంతాలలోని మురికివాడలలో నివాసం ఉంటున్న వారు సర్వం కొల్పోయారు. ఇండ్లు కుప్పకూలి, ఇంటిలోని వస్తువులు వరదలలో కొట్టుకుని వెల్లడంతో రోడ్డున పడ్డారు.

ఆదుకుంటారని ఎదురు చూపు

ఆదుకుంటారని ఎదురు చూపు

సర్వం కొల్పోయిన వారు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు ఆదుకుంటాయని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+