శిల్పాశెట్టి భర్త వ్యాఖ్య వివాదం, సల్మాన్ ఫ్యాన్స్ ఆగ్రహం
ముంబై: రాజస్థాన్ రాయల్స్ సహయజమాని, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బాలీవుట్ హీరో సల్మాన్ ఖాన్ మీద చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. బాలీవుడ్‌లో నటుడిగా రాణించాలనుకుంటున్నారా? అని జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు రాజ్ కుంద్రా స్పందిస్తూ.. బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఒక సినిమాకి సంపాదించే మొత్తం కన్నా చాలా ఎక్కువ డబ్బును తాను కేవలం నెలలో సంపాదిస్తానని చెప్పారు.
బాలీవుడ్‌లో టాప్ హీరో కన్నా ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు తాను బాలీవుడ్‌లో ఎందుకు నటించాలనుకుంటానని కుంద్రా విలేకరులను ప్రశ్నించారు. సంపాదన విషయంలో సల్మాన్ తనకు దరిదాపుల్లో కూడా లేడన్నారు. ఈ విషయాన్ని కావాలంటే సల్మాన్‌ను అడిగి ఖరారు చేసుకోవచ్చని సూచించారు.

బాలీవుడ్ తనను భరించలేదని కూడా ఆయన అన్నారు. కేవలం తన భార్య శిల్పాశెట్టి కోసమే తాను బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధపడ్డానని చెప్పారు. తన భార్య సింప్లిసిటీ, సర్దుకుపోయేతత్వం తనను ఫిదా చేశాయన్నారు. కాగా, రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మంచి స్నేహితురాలు.
కుంద్రా చేసిన వ్యాఖ్యలపై సల్మాన్ అభిమానులు విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సల్మాన్ అభిమానులు కుంద్రాపై తిట్ల దండకం మొదలు పెట్టారు.
సల్మాన్ ఖాన్ చేసే చారిటీ ముందు నీ నెల సంపాదన ఎందుకు కొరగాదని, నువ్వు మరో పది జన్మలు ఎత్తినా సల్మాన్ ఖాన్ ప్రతిష్ట రాదని, సల్మాన్ పైన రాజ్ కుంద్రా చేసిన వ్యాఖ్యలను ఎందుకు పట్టించుకుంటున్నారని, సల్మాన్ పేరును పబ్లిసిటీకి ఉపయోగించుకునే వారులో కుంద్రానే మొదటి వాడు కాదని, అలాగే చివరి వాడు కాదని, డబ్బులతో గౌరవాన్ని, ప్రతిష్టను కొనలేమని, డబ్బు విషయం కాదని, కుంద్రా హ్యూమానిటీ నేర్చుకోవాలని... ఇలా ఎన్నో ట్వీట్లతో రాజ్ కుంద్రా పైన విరుచుకుపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications