బిజెపి అంటే.., ఎవరడిగినా చేస్తారా: రాజ్ థాకరే చురక
ముంబై: బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదని భారతీయ జంతు పక్ష్ అని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాకరే ఎద్దేవా చేశారు. ముంబైలో మాంసం నిషేధం పైన ఆయన విమర్శలు గుప్పించారు.
బీజేపీలోని జనతా (భారతీయ జనతా పార్టీ) అంటే కేవలం జైనులే కాదన్నారు. బీజేపీ అంటే భారతీయ జంతు పక్ష్ పార్టీగా మారిందన్నారు. ముంబైలో ప్రజలు ఏం చేయాలన్న దానిని కేవలం జైనులే నిర్ణయించలేరు కదా అని ప్రశ్నించారు.

రేపు మరో వర్గానికి చెందిన ప్రజలు తమ పండగను పురస్కరించుకుని దుకాణాలన్నీ మూసేయాలని కోరితే అలాగే చేస్తారా? అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలన్నారు. బీజేపీ చర్యల వల్ల జైనులకు హిందువులు వ్యతిరేకం అనే అర్థం వస్తోందన్నారు. తక్షణం ప్రభుత్వ తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలన్నారు.
కాగా, ఉత్తరాది వారిని, బిహారీ అల్పసంఖ్యాక వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ థాకరేకు ఢిల్లీ హైకోర్టు గురువారం ఉపశమనం కల్పించిది. ఆయన పైన జారీ అయిన సమన్లను, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications