Gang rape : అంగన్‌వాడీలో జాబ్స్ ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై గ్యాంగ్‌రేప్...
అంగన్‌వాడీ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు ఉద్యోగులు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్‌వాడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఇద్దరు అధికారులు ఏకంగా 20 మంది మహిళలపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని పాలి జిల్లా సిరోహిలో చోటుచేసుకుంది.
పాలి జిల్లా సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మహేంద్ర మేవాడా, మాజీ కమిషనర్ మహేంద్ర చౌదరిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. సిరోహికి చెందిన ఈ ఇద్దరు అధికారులు అంగన్‌వాడీలో కొలువు ఇప్పిస్తామని కొందరు మహిళలను నమ్మించి వారికి ఓ ప్రదేశంలో ఆశ్రయమిచ్చారు. అక్కడ వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించారు. అనంతరం వారికి మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి స్పృహలో లేని మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 20 మందిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే, భాదితురాల్లో పాలికి చెందిన ఓ మహిళ తను అత్యాచారానికి గురయినట్లు డీవైఎస్పీ పరాస్ చౌదరికి ఫిర్యాదు చేసింది. తనతో పాటు మరో పది పదిహేను మందికి ఓ చోట వసతి ఏర్పాటు చేసి, తినే ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చి వారిపై అత్యాచారం చేశారని పోలీసులకు వివరించింది.

వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు : ఈ దృశ్యాలను చిత్రీకరించి విషయం బయటకి రాకుడదంటూ తనను బెదిరించారని బాధితురాలు తెలిపింది. వీడియోలు తీసి ఒక్కొక్కరూ రూ.5లక్షలు ఇవ్వాలని లేదంటే ఆ దృశ్యాలను వైరల్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తు్న్నారని బాధితురాలు పోలీసులకు వివరించింది. అంతటితో ఆగకుండా వారితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని బెదిరించారని, ఉద్యోగాల పేరుతో ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు కూడా తీసుకున్నారని భాదిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తమకు న్యాయం చేయాలని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు బాధిత మహిళలు. వెంటనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు రాజస్థాన్ పోలీసులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications