విషాదం: పెళ్లి ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. 9మంది సజీవ దహనం
జైపూర్ : రాజస్థాన్ అజ్మీర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి బీవర్ పట్టణంలోని ఆనంద్‌నగర్‌లో ఓ పెళ్లి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.
పేలుడు ధాటికి ప్రమాదం జరిగిన చోట రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పాటు దగ్గరలో ఉన్న రెండు కార్లు కూడా దగ్ధమయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.

శుక్రవారం సాయంత్రం వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడం, పక్కనే మరో ఫుల్ సిలిండర్ ఉండడంతో అది కూడా పేలి ప్రమాద తీవ్రత పెరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం సమాచారం అందగానే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక సిబ్బంది భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు.












Click it and Unblock the Notifications