ఎలక్షన్ ఫీట్: ఆ ఐదు కులాలకు రిజర్వేషన్లు.. రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మరి కొన్ని నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో తాయిలాలకు తెరదీసింది రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం. ఐదు కులాలకు 1శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంజారా/బల్దియా/లబనా, గాడియా-లోహర్/గడాలియా, గుజ్జర్/గుర్జార్, రైకా/రెబారీ, గడారికా/గాడ్రి కులాలను అత్యంత వెనకబడిన వర్గాలుగా గుర్తించి వారికి 1శాతం రిజర్వేషన్ కల్పించింది. రిజర్వేషన్ వర్తిపంజేయకముందు ఈ ఐదు కులాలు 1994 నుంచి ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. 1శాతం రిజర్వేషన్ కల్పిస్తూనే ఈ ఐదు కులాలకు చెందినవారికి విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో ఓబీసీ కోటాలో 21శాతం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొత్త చట్టం రూపుదాల్చాకా ఈ ఐదు కులాలకు చెందిన అభ్యర్థులు ముందుగా మెరిట్ ఆధారంగా జనరల్ కేటగిరీలో ఉద్యోగాలకు పరిగణిస్తారని... లేని పక్షంలో 21శాతం ఓబీసీ కోటాలో తీసుకుంటారని.. అదీ కాని పక్షంలో అత్యంత వెనకబడిన తరగతి (MBC)కింద ఒకశాతం కోటాలో తీసుకుంటారని స్పష్టం చేస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది అడ్మిషన్ రిక్రూట్‌మెంట్ శాఖ.

Rajasthan approved 1 percent reservation to five communities

అయితే 2017, డిసెంబర్ 21నే ఒక శాతం రిజర్వేషన్‌పై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆదివారం మంత్రి రాజేంద్ర రాథోడ్ దీనిపై స్పష్టమైన ప్రకటన త్వరలో వస్తుందని గుజ్జర్లకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లే రిజర్వేషన్ అమలు అయ్యేలా చట్టం తీసుకొచ్చారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో ప్రధాన మంత్రి మోడీ పర్యటన సందర్భంగా తమ నిరసన చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుంటున్నామని, రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు గుర్జర్ అరక్షన్ సంఘర్ష్ సమితి ప్రతినిధి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+