Rajasthan Assembly election 2023: సీఎం, మాజీ సీఎంలు కుమ్మక్కయ్యారు..?

రాజస్థాన్ (Rajasthan assembly election 2023)లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) అధినేత హనుమాన్ బేనివాల్ రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపెయిన్ విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఆయన చేస్తున్న సంకల్ప్ రథ యాత్ర సోమవారం రాత్రి 11:00 గంటలకు జోధ్‌పూర్‌లోకి ప్రవేశించింది.ప్రతి ప్రాంతంలోనూ ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తోంది. జోధ్‌పూర్‌లోని బనార్ ప్రాంతంలో క్రేన్‌లు, జేసీబీలతో పూలవర్షం కురిపించారు.

70 స్థానాల్లో విజయం సాధించడం:
రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ అధినేత ,నాగౌర్ ఎంపీ హనుమాన్ బేనివాల్ మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికను ప్రస్తావిస్తూ, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని, రెండు చోట్ల బీజేపీ డిపాజిట్‌ గల్లంతయ్యిందని బేనీవాల్ అన్నారు.

Rajasthan Assembly election 2023:

నేషనల్ డెమోక్రటిక్ పార్టీ యువత, రైతుల పార్టీ అని హనుమాన్ బేనివాల్ అన్నారు. రాజస్థాన్ ప్రజలు కాంగ్రెస్ మరియు బిజెపి రెండింటికీ స్వస్తి పలికి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఘాటు విమర్శలు చేసిన ఆయన.. శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. మహిళలు, బాలికలపై నేరాలు పెరిగి యువత భవిష్యత్తుతో గెహ్లాట్ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని నిప్పులు చెరిగారు.

సీఎం గెహ్లాట్, వసుంధర రాజే ఇద్దరూ కుమ్మక్కయ్యారని..
రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కాపాడారని, ఇద్దరూ కుమ్మక్కయ్యారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వయంగా అన్నారని గుర్తుచేశారు బేనీవాల్. ఒకసారి అశోక్ గెహ్లాట్, మరోసారి వసుంధర రాజే ఇలా ఇద్దరూ కుమ్మక్కై రాజస్థాన్‌ను పాలిస్తున్నారని ఇక మీదట ఆ ఆటలు సాగనివ్వమని బేనీవాల్ చెప్పారు.

సచిన్ పైలట్ భయపడ్డాడు
హనుమాన్ బేనివాల్ సచిన్ పైలట్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పైలట్ భయపడినట్లు తనకు అనిపిస్తోందన్నారు. లేదా మరేమైనా అంతర్గత విషయం పై ఆయన వెనక్కి తగ్గి ఉంటారని బేనీవాల్ అన్నారు.అయితే సచిన్ పైలట్ తనకు మంచి మిత్రుడని చెప్పిన బేనీవాల్....తాను కొత్త పార్టీ పెట్టి పోరాడతానని తనతో చెప్పినట్లు బేనీవాల్ గుర్తుచేశారు.అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆలోచన విరమించుకుని తిరిగి గెహ్లాట్ చెంతకు చేరాడని చెప్పారు.అయితే ఇందులో బీజేపీ కుట్ర ఉందని తాను భావిస్తున్నట్లు బేనీవాల్ చెప్పారు.

Rajasthan Assembly election 2023:

సచిన్ పైలట్‌కు గుర్జార్‌ వర్గాల్లో, యువతలో క్రేజ్‌ ఉండడం దురదృష్టకరమని, అయినా ఆయన మౌనంగా కూర్చున్నారని హనుమాన్‌ బేనీవాల్‌ అన్నారు. విద్యార్థి సంఘం ఎన్నికలకు సంబంధించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. ఇంత అవినీతి జరుగుతోందని, ఒక్క విచారణ కూడా చేయలేకపోయారని, ఈరోజు చేస్తున్నామని, రేపు పూర్తి చేస్తామంటూ కాలయాపన చేశారని బేనీవాల్ కాంగ్రెస్ ప్రభత్వంపై మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ రాబోతోందని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజలు అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్‌ల ఎపిసోడ్‌‌తో విసిగి వేశారిపోయారని అన్నారు. ఈసారి చాలా మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు డిపాజిట్లు కూడా రావని బేనీవాల్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+