రేపే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్....
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. సుమారు నెలన్నర రోజుల నుంచి జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి నిన్న సాయంత్రంతో ముగింపు పడింది.రేపు
అంటే నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇక ఇక్కడి పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం..
199 నియోజకవర్గ స్థానాలకు రేపే పోలింగ్ : రాజస్థాన్‌లో మొత్తం 200 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సారి 199 నియోజకవర్గ స్థానాలకు గాను ఒకేరోజు పోలింగ్ జరగనుంది. అయితే, రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఈసారి 5.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నాను. ఈ 5.25 కోట్ల మంది ఓటర్లకు 51 వేల 756 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3 తేదీన ఎన్నికల కమీషన్ విడుదల చేస్తోంది. అయితే, రాజస్థాన్ లో ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి, నిన్నటివరకు మొత్తం 682 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేయడం జరిగింది.

ఈ రాష్ట్రంలో మొత్తం 1875 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో183 మంది స్త్రీ అభ్యర్థులు నిలువవగా, 1692 మంది పురుష అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో పోటీచేయనున్నారు. జోత్వారా అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎక్కువగా 18 మంది అభ్యర్థులు, లాల్సోట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యంత తక్కువగా ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలిచారు. రాజస్థాన్ రాష్ట్రంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 అసెంబ్లీ సీట్లను, బీజేపీ 73 అసెంబ్లీ సీట్లను గెల్చుకోవడం జరిగింది.
తొలిసారిగా తమ ఓటు వేయబోతున్న గ్రామస్థులు : అయితే ఈ ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలోని ఓటర్లు మాత్రం స్వాత్రంత్యం వచ్చిన తర్వాత తొలిసారిగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ నియోజకవర్గం పేరు అబు పింద్వారా అసెంబ్లీ.. ఈ ప్రాంతం నాలుగువేల 921 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ నివసించే షేర్‌గావ్ ప్రజలు మొట్టమొదటిసారిగా తమ పోలింగ్ బూత్‌లో రేపు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. 35 మంది ఓటర్లున్న బార్మర్ కా పార్, 49 మంది ఓటర్లు ఉన్న మంఝోలి, 50 మంది ఓటర్లున్న కంటల్ కా పార్ గ్రామాల్లోనూ ఈసారి పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేందుకు ఆస్కారం లేకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications