ఛీ: ఆలయంలో బికినీలో విదేశీ మోడల్: ఫోటో షూట్ (వీడియో)
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఆలయంలో విదేశీ మోడల్ బికినీ వేసుకుని ఫోజులు ఇస్తున్న సమయంలో ఫోటో షూట్ చేశారు. హిందూ సాంప్రధాయాలు మంటకలిపారని ఫిర్యాదు చెయ్యడంతో విదేశీ మోడల్,
ఉదయ్ పూర్ (రాజస్థాన్): ప్రసిద్ధి చెందిన ఆలయంలో హిందూ సాంప్రధాయాలను మంటకలిపి విదేశీ మోడల్ తో బికినీలో ఫోటో షూట్ చెయ్యడంతో స్థానికులు మండిపడుతున్నారు. ఆలయ నియమాలు ఉల్లంఘించి దేవుడి ప్రతిష్ట దిగజార్చిన వారి మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఉంది. ఈ ఆలయంలో విదేశీ మోడల్ తో బికినీలో ఫోటో షూట్ చెయ్యడానికి సిద్దం అయ్యారు. విదేశీ మోడల్ చుట్టూ కొందరు మహిళలు హిందూ సాంప్రధాయం ప్రకారం చీరలు కట్టుకుని నిలబడి ఉన్నారు.

ఆ సమయంలో విదేశీ మోడల్ బికినీ వేసుకుని అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో ఫోటో షూట్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పెద్దలు ఆలయం నిర్వహకుల మీద మండిపడుతున్నారు.
ఆలయం పవిత్రతను మంటకలిపారని విరుచుకుపడ్డారు. విదేశీ మోడల్ మీద, ఫోటో షూట్ చేసిన ప్రోడక్షన్ హౌస్ సంస్థ మీద ఉదయ్ పూర్ లోని శారదా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రోడక్షన్ హౌస్, విదేశీ మోడల్ మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications