Ashok Gehlot: ఎంత పని చేశావు గెహ్లాట్.. షాక్‍లో రాజస్థాన్ ప్రజలు..!
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బడ్జెట్ సమావేశాల్లో పాత బడ్జెట్ ను చదివి వినిపించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పప్పులో కాలేశారు. రాజస్థాన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గెహ్లాట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన గత సంవత్సరం బడ్జెట్ ను చదివి వినించారు. ఇలా దాదాపు కొద్ది నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత అక్కడే ఓ మంత్రి దీన్ని గుర్తించి సీఎంను అలర్ట్ చేశారు. దీంతో నాలుక కరుచుకున్న అశోక్ గెహ్లాట్ కొత్త బడ్జెట్ చదివారు.

7 నిమిషాల పాటు
సీఎం పాత బడ్జెట్ దాదాపు 7 నిమిషాలు చదివారు. గ్యాలరీలో కూర్చున్న అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో అస్సలు విషయం అప్పుడు తెలిసింది. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు వెలులోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. కాసేపు వెల్ లో బైఠాయించారు. ఆ తర్వాత స్పీకర్ సీపీ జోషి సభను అరగంట పాటు వాయిదా వేశారు.

ఆర్థిక శాఖ
రాజస్థాన్ లో ఈ ఏడాదిలోనే అసెంబ్లీలో ఎన్నికలు జరగనున్నాయి. గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. దీంతో ఈ బడ్జెట్ పై ఆసక్తి నెలకొంది. కానీ సీఎం పాత బడ్జెట్ చదవడంతో గందరగోళం నెలకొంది. అశోక్ గెహ్లాట్ ఆర్థిక శాఖను కూడా తన వద్ద ఉంచుకోవడంతో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

పట్టణ ఉపాధి పథకం
గతేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోని "MGNREGA గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం చేస్తున్నప్పటికీ, వీధి వ్యాపారులకు, అలాగే పట్టణ ప్రాంతాల్లోని ధాబాలు, రెస్టారెంట్లలో పనిచేసే వారికి అలాంటి పథకం లేదు" అని గెహ్లాట్ పట్టణ ఉపాధి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదిలో 100 రోజుల ఉపాధి కల్పించడానికి రూ.800 కోట్లు కేటాయించారని చదివారు.

స్మార్ట్ఫోన్లు
ముఖ్యమంత్రి చిరంజీవి యోజన కింద ఉన్న 1.33 కోట్ల కుటుంబాల మహిళా పెద్దలకు కూడా గెహ్లాట్ మొబైల్ ఫోన్లను ప్రకటించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మూడేళ్లపాటు ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. దీని కోసం ప్రభుత్వం ఏటా రూ.2,500 కోట్లు భరిస్తుందని చదివారు. ఇది కూడా గతేడాది బడ్జెట్ కు సంబంధించిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications