ఒకే ఇంట్లో నుంచి బరిలో దిగనున్న భార్య భర్తలు... గెలుపెవరిదో..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికల హాంగామా షూరు కానుంది. ఇక రాజస్థాన్‌లోని ఓ నియోజకవర్గంలో మాత్రం ఆసక్తికర వాతవారణం నెలకొంది. ఒకే ఇంట్లో నుంచి భార్య భర్తలు పోటీకి దిగనున్నారు. అది కూడా వేరు వేరు పార్టీల నుంచి... సహజంగా ఒకే ఇంట్లోని కుటుంబసభ్యులు అందరూ ఒకే పార్టీకి సపోర్టు చేయడం ఎక్కడైనా కామన్. కానీ, ఇక్కడ మాత్రం భార్య భర్తలే వేరు వేరు పార్టీల్లో ఉండడమే కాకుండా, పోటీ కూడా చేస్తున్నారు. దీంతో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కాస్తా రసవత్తరంగా మారనున్నాయి. ఈ భార్యభర్తల మధ్య గెలుపెవరిదో వేచి చూడాల్సిందే.. అంతకన్నా ముందు వీరి గురించి కాస్తా తెలుసుకుందా.
భార్య భర్తల మధ్య పోటీ..:రాజస్తాన్‌లోని దాంతా రామ్‌గఢ్‌లోనే అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నుంచి భార్య, భర్తలు బరిలోకి దిగనున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు నారాయణ సింగ్ కొడుకే వీరేంద్ర సింగ్. నారాయణ సింగ్ ఎన్నికల నుంచి తప్పుకోగానే వీరేంద్ర పార్టీలోకి అడుగపెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వీరేంద్ర సింగ్ ఇప్పటివరకూ విజయవంతగానే రాణిస్తున్నారు. ప్రస్తుతం దాంతా రామ్‌గఢ్‌లోనే ఆయనే మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తాయి. ఈ తరుణంలో ఆయనకు ఇంటినుంచే పోటీ ఎదరుయ్యింది. వీరేంద్ర సింగ్ భార్య రీతా చౌదరి కూడా రామ్‌గఢ్ నుంచే బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె జేజేపి నుండి పోటీచేస్తున్నట్లు సమాచారం. దీంతో నవంబర్ 25 న జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భార్య, భర్తల మధ్య ఓ యుద్ధ వాతావరణం నెలకొనుంది.

జేజేపి పార్టీ అధ్యక్షురాలిగా...:అయితే, రీతా చౌదరి ఆగస్టులో జననాయక్ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆమె జేజేపి పార్టీ మహిళ విభాగానికి అధ్యక్షురాలిగి వ్యవహరిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాంతా రాంగడ్ నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్‌ను టికెట్ కోరింది రీతా చౌదరి. ఆ సమయంలో కాంగ్రెస్ ఆమెకు టిక్కెట్ ఇవ్వకపోగా, రీతా భర్త వీరేంద్ర సింగ్‌కు టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఈ సందర్భంగా రీతా చౌదరి మాట్లాడుతూ.. 'ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి, నా ప్రవేశంతో వారు సంతోషంగా ఉన్నారు. దాంతా రామ్‌గఢ్ సీటు నుంచి పార్టీ నన్ను అభ్యర్థిగా ఎంచుకుంది. నా విజయం పై నాకు ఎంతో విశ్వాసం ఉంది' అని తెలిపారు. భర్తపై పోటీ చేయడం గురించి ఆమె మాట్లాడుతూ... 'కాంగ్రెస్ ఆ నియోజకవర్గంలోని అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కాబట్టి, ఈ విషయంపై నేను ఎలాంటి కామెంట్లు చేయలేను అని అన్నారు.

నారాయణ సింగ్ ఏడు సార్లు ఎమ్మెల్యే..:వీరేంద్ర సింగ్ తండ్రి నారాయణ్ సింగ్ ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. నారాయణ్ సింగ్ 1972, 1980, 1985, 1993, 1998, 2003, 2013 ఎన్నికల్లో పోటీ చేసి వరుస విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత 2018లో ఎన్నికల్లో పోటీచేయనని నారాయణ్‌సింగ్ చెబితే కాంగ్రెస్ పార్టీ వీరేంద్ర సింగ్‌కు టిక్కెట్ ఇచ్చింది. వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. 'జేజేపీ ఆమెను దాంతా రామ్‌గఢ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. నేను మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్నాను. ఈ స్థితిలో మా ఇద్దరి మధ్య నేరుగా పోటీ జరగబోతుంది అని అన్నారు.












Click it and Unblock the Notifications