రాజస్థాన్ మంత్రిపై రేప్ కేసు: కుట్ర అని వ్యాఖ్య

తనపై అత్యాచారం చేసిన విషయాన్ని బయటపెడితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను బెదిరించారని కూడా ఫిర్యాదులో చెప్పింది. ఈ ఆరోపణల ఆధారంగా మంత్రిపై కేసు నమోదు చేయాల్సిందిగా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయనపై ఐపీసీ సెక్షన్ 376, 323 కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసును సిఐడి క్రైమ్ బ్రాంచ్‌కు రెఫర్ చేసినట్టు తెలిపారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది రాజకీయ ప్రత్యర్థులు తనపై పన్నిన కుట్ర అని బాబూలాల్ నాగర్ మండిపడ్డారు. ఆ మహిళ తన ప్రత్యర్థులు ఆడించినట్టల్లా ఆడి తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని అన్నారు.
ఈ నెల 11వ తేదీన తాను ఉదయం 8 నుంచి రాత్రి 8వరకు తన నియోజకవర్గం ప్రజలను కులుసుకోవడంతోనే తనకు సరిపోయిందని, ఆ రోజు తన కుటుంబ సభ్యులు కూడా తన నివాసంలో ఉన్నారని ఆయన అన్నారు. ఆ మహిళ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ అడిగిందని, అయితే కాంగ్రెసు అందుకు నిరాకరించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications