అత్యాచారం కేసు: రాజస్థాన్ మంత్రి రాజీనామా

 Rajasthan minister booked for rape resigns: Report
జైపూర్: తనపై అత్యాచారం కేసు నమోదు కావడంతో రాజస్థాన్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, పాడి పరిశ్రమ శాఖల మంత్రి బాబులాల్ నగర్ తన పదవికి రాజీనామా చేశారు. అత్యాచారం కేసులో పోలీసులు ఆయనను బుధవారంనాడు ప్రశ్నించారు.

ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి తన అధికారిక నివాసంలో మంత్రి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బాధ్యత పార్టీకి చెందిన సభ్యుడిగా, నైతిక కారణాలతో రాజీనామా చేయాలని తాను అనుకుంటున్నట్లు ఆయన అంతకు ముందు చెప్పారు.

తనను ఈ నెల 11వ తేదీన ఇంటికి రమ్మని పిలిచి, తనపై మంత్రి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఆరోపించింది. బుధవారం రాత్రి పోలీసులు మంత్రిని విచారించారు. మంత్రి ఎక్కడ అత్యాచారం చేశాడనే విషయాన్ని తెలుసుకోవడానికి మహిళను రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆయన నివాసానికి తీసుకుని వెళ్లారు.

సోదాలా పోలీసు స్టేషన్‌లో బాబులాల్ నగర్‌పై కేసు నమోదైంది. అయితే, తన రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయని బాబులాల్ నగర్ ఇంతకు ముందు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+