Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

న్యూ ఇయర్ వేళ భారీ ఉగ్ర కుట్న భగ్నం..! దిల్లీ తరహా పేలుళ్లకు స్కెచ్..?

దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముస్తాబవుతున్న వేళ రాజస్థాన్ లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. రాజాస్థాన్ లో ఓ కారులో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, పేలుడు కాట్రిజ్ లు, ఫ్యూజ్ వైర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ దిల్లీ తరహా పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ లోని టోంక్ ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన తనిఖీల్లో భాగంగా ఓ మారుతీ కారులో దాదాపు 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, 2000 పేలుడు కాట్రిజ్‌ లు, 1,100 మీటర్ల సేఫ్టీ ఫ్యూజ్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్‌ లోని బూంది ప్రాంతం నుంచి టోంక్‌ ప్రాంతానికి పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయని పోలీసులకు సమాచారం అందించిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న కారులో సోదాలు జరిపిన నేపథ్యంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Rajasthan Police Foil Major Terror Plot 150 kg Explosives Seized on New Year s Eve

ఇక గత నెలలో దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ బృందం కీలక విషయాలను తేల్చింది. ఉగ్రవాది ఉమర్‌ ఉన్‌ నబీ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకొని ఈ దారుణానికి పాల్పడినట్టు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో అల్‌- ఫలాహ్‌ వర్సిటీకి చెందిన చాలా మంది డాక్టర్లకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+