సెంట్రల్ జైల్లో వీఐపీ సేవలు, నెలకు రూ. 8 లక్షలు, సిగరెట్ ప్యాకెట్ రూ. 15 వేలు!

జైపూర్: రాజస్థాన్ లోని అజ్మర్ సెంట్రల్ జైలులో ఖైదీలు విలాసవంతమైన జీవితం (వీఐపీ సేవలు) అనుభవించడానికి నెలకు రూ. లక్షల్లో చెల్లిస్తున్నారని విచారణలో వెలుగు చూసింది. అజ్మర్ సెంట్రల్ జైలులో ఎంత అవినీతి జరుగుతుందో అనే విషయం అవినీతి నిరోదకదళం శాఖ (ఏసీబీ) వెలుగులోకి తెచ్చింది.

అజ్మర్ సెంట్రల్ జైలులో బ్యారెక్ 1 నుంచి 15వ బ్యారెక్ వరకు వీఐపీల గదులు ఉన్నాయి. శ్రీమంతులైన ఖైదీలకు మాత్రమే ఈ బ్యారెక్ లలో గదులు చిక్కుతాయని సమాచారం. ఇలాంటి వీఐపీలు ఉంటున్న గదుల్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని వెలుగు చూసింది.

ACB revealed that, Rajasthans Ajmer central jail VIP room for inmates available at 8 lakh per month.

ప్రత్యేక గదులు, ప్రత్యేకమైన వంటలు, స్వచ్చమైన విలాసవంతమైన దుస్తులు తదితర సౌకర్యాలు ఇక్కడ ఉన్న ఖైదీలకు చిక్కుతాయని సమాచారం. ఇలాంటి గుదుల్లో ఉంటున్న ఖైదీల నుంచి నెలకు కూ. 8 లక్షల వరకూ వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు బయట ఉంటారని, వారి నుంచి ఈ మొత్తం నగదును జైల్లో పని చేస్తున్న కొందరు సిబ్బంది వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ మొత్తం లంచం కొందరు నగదు రూపంలో ఇస్తున్నారని, కొందరు ఆన్ లైన్ లో బ్యాంకు అకౌంట్లకు సరఫరా చేస్తున్నారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

నెలకు సిగరేట్ ప్యాకెంట్లు సరఫరా చెయ్యడానికి రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు, పొగాకు ఉత్పత్తులు సరఫరా చెయ్యడానికి ప్యాకెట్ కు రూ. 300 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నారని వెలుగు చూసింది. మొత్తం 15 బ్యాంకు అకౌంట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు 12 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+