ఘోర ప్రమాదం.. 18 మంది భక్తులు మృతి..

రాజస్థాన్ లో మరో ఘోరం జరిగింది. రాజస్థాన్ లోని ఫలోడి వద్ద మటోడా గ్రామం పరిధిలో ట్రావెల్ బస్సు ఆగి ఉన్న ట్రక్కు ను ఢీ కొన్న ఘటనలో 18 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులంతా జోధ్ పుర్ లోని సూర్ సాగర్ కు చెందినవారుగా తేలింది. మృతులంతా బికనూర్ లోని కోలాయత్ ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఇటీవల ఓ ప్రైవేటు బస్సు మంటల్లో దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అయితే ఈ ఘటన మరువకముందే రాజస్థాన్ లో మరో విషాదం నెలకొంది. రాజస్థాన్ లోని ఫలోడి వద్ద మటోడా గ్రామంలో ఆగి ఉన్న ట్రక్కును భక్తులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సులోని 18 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Rajasthan Weeps 18 Devotees Gone 4 Fighting for Life

మృతులంతా జోధ్ పుర్ లోని సూర్ సాగర్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బికనూర్ లోని కోలాయత్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపుర్ కు 400 కిలోమీటర్ల దూరంలో భారత్ మాల హైవే పై మటోడా గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మాజీ సీఎం అశోక్ గెహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళి అర్పించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+