రెండో పెళ్ళి చేసుకొని మొదటి భార్యతో సంసారం, ముక్కలుగా నరికేశాడు ,ఎందుకంటే?

బెంగుళూరు: అగ్నిసాక్షిగా వివాహం చేసుకొన్న బార్యకు వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి పూడ్చివేశాడు. మృతదేహం గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మృతురాలి తలను కాల్చివేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

భార్యను చంపేసి ఆమె కన్పించడం లేదని పోలీసులకు నిందితుడే ఫిర్యాదు చేశాడు. భార్య అదృశ్యం విషయమై పోలీసుల ప్రశ్నలకు నిందితుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో నిందితుడిని పోలీసులు లోతుగా విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

కర్ణాటక రాష్ట్రంలోని తపసీహళ్ళికి చెందిన మునిరాజు కుమార్తె లక్ష్మికి బొమ్మనహళ్లికి చెందిన రాజేష్‌కు 2011లో వివాహమైంది. అయితే వివాహమైన కొంత కాలం వరకు భార్య, భర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయితే భార్యకు వివాహేతర సంబంధం ఉందని భావించిన నిందితుడు ఆమెను వేధించడం ప్రారంభించాడు. చివరకు ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడు.

భార్యను హత్యచేసిన భర్త

భార్యను హత్యచేసిన భర్త

రెండేళ్ళ పాటు రాజేష్, లక్ష్మిల కాపురం సజావుగా సాగింది. అయితే రెండేళ్ళ తర్వాత లక్ష్మిని అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధింపులకు గురి చేశాడు. . అంతేకాదు భర్తను వదిలి పుట్టింటికి వచ్చింది. దీంతో బాధితురాలు వరకట్న వేధింపుల కేసు పెట్టింది కేసు విచారణ చేసిన కోర్టు ప్రతి నెల లక్ష్మికి రూ.1500 చెల్లించాలని ఆదేశించింది.

రెండో పెళ్ళి చేసుకొన్న రాజేష్

రెండో పెళ్ళి చేసుకొన్న రాజేష్

లక్ష్మి పుట్టింటికి వెళ్ళడంతో రాజేష్ పెద్దల అంగీకారంతో రెండో వివాహం చేసుకొన్నాడు. రెండో భార్యతో కాపురం చేస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో కాని గత ఏడాది మనసు మార్చుకొన్న రాజేష్ లక్ష్మి ఇంటికి వచ్చి ఆమెను తనతో పంపాలని కోరాడు,. గత ఏడాది నుండి లక్ష్మి రాజేష్‌తో పాటు బొమ్మనహల్లిలోనే ఉంటుంది.

కిరాతకంగా హత్య చేసిన రాజేష్

కిరాతకంగా హత్య చేసిన రాజేష్

ఫిబ్రవరి 9వ, తేదిన లక్ష్మిని రాజేష్‌ అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి సమీపంలోని గుండసంద్ర గ్రామం చెరువుకి తీసికెళ్లాడు. అక్కడ తలను కాల్చివేసి, శరీర భాగాలను చెరువులో వేశాడు. అదే రోజు రాత్రి తన భార్య కనిపించడం లేదని దొడ్డబెళవంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివాహేతర సంబంధం కారణంగానే హత్య

వివాహేతర సంబంధం కారణంగానే హత్య

భార్య అదృశ్యం విషయమై పోలీసులు అడిగిన ప్రశ్నలకు రాజేష్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులకు రాజేష్‌పై అనుమానం వచ్చింది.తమదైన శైలిలో పోలీసులు విచారిస్తే అసలు విషయాన్ని రాజేష్ ఒప్పుకొన్నాడు. వివాహేతర సంబంధం అనుమానంతోనే లక్ష్మిని హత్య చేసినట్టు రాజేష్ ఒప్పుకొన్నాడు. గతేడాది మళ్లీ సంసారానికి వచ్చాక పరాయి పురుషులతో మాట్లాడుతుండేదని, తాను ప్రశ్నించగా కోర్టు ఆదేశం ప్రకారం ఇవ్వాల్సిన బాకీ రూ.1.75లక్షలు ఇస్తే వెళ్లిపోతానని గొడవ చేసిందని వివరించాడు.

చెరువు నుండి శరీర బాగాల వెలికితీత

చెరువు నుండి శరీర బాగాల వెలికితీత

బుధవారం సాయంత్రం అసిస్టెంట్‌ కలెక్టర్‌ మహేశ్‌బాబు సమక్షంలో ఎస్పీ అమిత్‌సింగ్‌ ఆధ్వర్యంలో గుండసంద్ర గ్రామం చెరువులో రాజేశ్‌ పూడ్చిన లక్ష్మి శరీర భాగాలను పోలీసులు వెలికితీయించిపోస్టుమార్టం నిమిత్తం తరలించారు.నిందితుడిని చంపేస్తామని మృతురాలి బంధువుల గొడవకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+