ఎంట్రీకి పదును పెడుతున్న తలైవా: బెంగళూరు ఏజెన్సీతో రజనీ చర్చలు..

ఈ నేపథ్యంలో రజనీ పొలిటికల్ ఎంట్రీని ధ్రువీకరించేలా మరో వార్త తెరపైకి వచ్చింది. పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కోసం బెంగుళూరులోని ఓ ఏజెన్సీని రజనీ సంప్రదించినట్లు తెలుస్తోంది.

చెన్నై: తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘట్టం మొదలవడానికి ఇంకా కొద్దిరోజులే సమయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తమిళ రాజకీయాల్లో రజనీ శకం ప్రారంభమవడం ఇక లాంఛనమే అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తగ్గట్లే రజనీ అనుచరుల నుంచి కొత్త పార్టీ సంకేతాలు అందుతూ వస్తున్నాయి.

rajini approached a bengaluru agency for political suggestions

ఈ నేపథ్యంలో రజనీ పొలిటికల్ ఎంట్రీని ధ్రువీకరించేలా మరో వార్త తెరపైకి వచ్చింది. పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కోసం బెంగుళూరులోని ఓ ఏజెన్సీని రజనీ సంప్రదించినట్లు తెలుస్తోంది. పార్టీ సన్నాహక కార్యక్రమాలతో పాటు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడానికి వినూత్న కార్యక్రమాలు నిర్వహించే దిశగా ఈ ఏజెన్సీతో ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు.

పార్టీకి సంబంధించి ఎజెండాను తయారుచేయడంలోను ఏజెన్సీ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్టీని తీర్చిదిద్దడంలోను, తమిళ రాజకీయాల్లో రజనీ గ్రాండ్ ఎంట్రీకి పక్కా రోడ్ మ్యాప్ ను రూపొందించడంలోను ఈ ఏజెన్సీ కీలక పాత్ర పోషించినున్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+