'సీఎం'గా రజనీకాంత్ పోస్టర్లు.. 'తలైవాతోనే తమిళనాడుకు మేలు!'..

రజనీ రాజకీయాల్లోకి వస్తే దేవుళ్లు సైతం ఓటేయాల్సిందే అని తమిళ జనంలో ఒక అభిప్రాయం ఉంది. ఈ ఒక్క మాట చాలు ఆయన 'సై' అంటే పట్టం కట్టడానికి వారు సిద్దంగా ఉన్నారని.

చెన్నై: 'తలైవా రజనీ' ఈ పేరంటేనే తమిళనాట ఓ ప్రభంజనం. జనాలను ఉర్రూతలూగించే సంచలనం. ఒక్క సినిమాలనే కాదు.. రాజకీయాలతో సహా తమిళనాట దేన్నయినా ప్రభావితం చేయగల వ్యక్తి ఆయన. ఒక్క మాట చాలు.. ప్రభుత్వాలు పడిపోవడానికి, నిలబడటానికి.

అంతటి స్టామినా రజనీకాంత్ సొంతం. కాబట్టే 1996లో ఆయన చేసిన ఒకే ఒక వ్యాఖ్య వల్ల అన్నాడీఎంకె అధికారంలోకి రాకుండా పోయింది. పరోక్షంగానే రాజకీయాలను అంతగా శాసించే సత్తా గల వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే చూడాలనేది తమిళుల చిరకాల కల.

Rajini fans create flutter with posters, invite him to politics

కానీ రజనీకి మాత్రం పవర్ పాలిటిక్స్ మీద అంతగా ఆసక్తి లేదు. ఆ మాట ఆయన ఇప్పటికీ పలుమార్లు స్వయంగా వెల్లడించారు. అయినా సరే తమిళుల్లో ఎక్కడో చిన్న ఆశ.. ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని. మరీ ముఖ్యంగా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అటు బీజేపీ సైతం ఆయన్ను రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉందా? అన్న అనుమానాలు కూడా ప్రస్తుతం తెరపై వేలాడుతున్నాయి. రజనీ పొలిటికల్ ఎంట్రీ పట్ల అమిత్ షా చేసిన 'లెట్స్ వెయిట్ అండ్ వాచ్' అన్న కామెంట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. బీజేపీ ద్వారా ప్రత్యక్షంగా కాకపోయినా.. మరో ప్రత్యేక పార్టీ పెట్టి ఆయన అధికారంలోకి వచ్చినా తద్వారా లాభపడాలని బీజేపీ యోచిస్తోంది.

అయితే తలైవా మనసులో మాత్రం రాజకీయాలకు చోటు లేదన్న సంగతి పలుమార్లు వెల్లడవుతూనే ఉంది. అదే సమయంలో తమిళులు సైతం రజనీ పొలిటికల్ ఎంట్రీ పట్ల తమ ఆకాంక్షను వెలిబుచ్చుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళనాట రజనీ పొలిటికల్ ఎంట్రీని కాంక్షిస్తూ కొన్ని ప్రత్యేక పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో కుర్తా, తమిళ పంచెకట్టులో 'సీఎం'గా రజనీ దర్శనమిస్తున్నారు. వెనకాలే ఫైల్స్ చేత పట్టుకున్న అధికారులు ఆయన్ను అనుసరిస్తున్నారు. తమిళనాడుకు తదుపరి సీఎం మీరైతేనే మేలు అన్న ఆకాంక్షను పోస్టర్ల ద్వారా చాటుకున్నారు.

ప్రస్తుతం తమిళ జనమంతా ఈ పోస్టర్ల ఎదుట నిలబడి రజనీ సీఎం అయితే బాగుండు అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే దేవుళ్లు సైతం ఓటేయాల్సిందే అని తమిళ జనంలో ఒక అభిప్రాయం ఉంది. ఈ ఒక్క మాట చాలు ఆయన 'సై' అంటే పట్టం కట్టడానికి వారు సిద్దంగా ఉన్నారని. మరి రజనీ మనసు మారుతుందా? రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఊహాగానం కాక సాకారం అయ్యే రోజు వస్తుందా?.. లెట్స్ వెయిట్ అండ్ వాచ్..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+