వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో రజనీ మద్దతు: ఫ్యాన్స్ అభిప్రాయ సేకరణ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు... లోకసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే విషయమై అభిప్రాయ సేకరణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ తమిళనాడు రాజకీయాలను శాసిస్తారు. రజనీకాంత్ కోసం వివిధ పార్టీలు అర్రులు చాస్తుంటాయి. రజనీకాంత్ ఎన్నికల్లో ఓటు వేసిన అంశం కూడా గత ఎన్నికల్లో చర్చనీయాంశమైంది.

రజనీకాంత్ బిజెపిలో చేరుతారనే ప్రచారం కొంతకాలం క్రితం జరిగింది. ఆయన ఏ పార్టీ వైపు చూస్తారనే ఆసక్తి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు 2014 లోకసభ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడిన సమయంలో రజనీ అభిమానులు, రజనీ ఫ్యాన్ క్లబ్ ఎవరికి మద్దతివ్వాలనే విషయమై అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.

Rajini

రజనీ అభిమానులు చేస్తున్న హడావుడి చర్చనీయాంశమైంది. చెన్నై, సేలంలో వారు అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారన్న సమాచారం సేకరిస్తున్నారట. అయితే, ఈ సమావేశాలపై ఫ్యాన్ క్లబ్ లీడర్ రాందాస్ స్పందించారు. అలాంటి సమావేశాలు జరగలేదని ఖండించారు. ఎవరైనా వ్యక్తిగతంగా సమావేశాలు నిర్వహించుకోవచ్చునని, అది తెలియదన్నారు.

1996లో డిఎంకె, కాంగ్రెస్ కూటమికి రజనీ మద్దతు పలికారు. తర్వాత ఎన్నికల్లో బిజెపికి ఓటు వేశారు. గత ఎన్నికల్లో మంచి పాలన అందించే పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, రజనీ మద్దతు కోసం బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

దీనికి తోడు, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో రజనీకాంత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే రజనీ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఆయన అభిమానులు చేపట్టిన అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత, రజకీ ఓ నిర్ణయానికి వస్తారని అంటున్నారు.

English summary
According to sources, Rajini fan club functionaries assembled in Chennai to discuss their support in Lok sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X