వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీపై వ్యాఖ్యలు: విజయ్ కాంత్ మూలాలేమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై డిఎండికె అధినేత, నటుడు విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం చల్లారడం లేదు. తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విజయ్ కాంత్ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు భగ్గుమంటున్నారు.

తాను ఎవరికీ భయపడబోనని, ప్రత్యర్థి పార్టీలు బెదిరిస్తే భయపడి పారిపోవడానికి తాను రజనీకాంత్‌ను కాదని విజయ్ కాంత్ శుక్రవారం ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రజనీకాంత్ తమిళ మూలాలను కూడా ఆయన ప్రశ్నించారు.

"మీరు ఆయనను (రజనీకాంత్‌ను) తమిళియన్ అంటారు. కానీ ఆయన సినిమాలను ఎవరు సెన్సార్ చేస్తారో తెలుసా" అని విజయ్ కాంత్ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ మరాఠీ కుటుంబంలో రజనీకాంత్ జన్మించిన విషయం రహస్యమేమీ కాదు.

Rajinikanth fans angry at Vijayakanth

కాగా, విజయ్ కాంత్ తమిళనాడులోని మధురైలో ఓ తెలుగు కుటుంబంలో విజయ్ కాంత్ జన్మించారు. ఆదివారంనాడు విజయ్ కాంత్ దిష్టిబొమ్మను రజనీ అభిమానులు దగ్ధం చేశారు. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలనే విషయాన్ని రజనీకాంత్ తన అభిమానులకు చెప్పలేదు. ఓటేసే అవకాశాన్ని ఆయన అభిమానులకే వదిలేశారు.

అభిమానులకు పిలుపు ఇవ్వనప్పటికీ రజనీకాంత్‌ను లాగాలని విజయ్ కాంత్ చూస్తున్నారని రజనీ అభిమాన సంఘం చెన్నై అధ్యక్షుడు ఎన్ రాందాస్ విమర్శించారు.

English summary
Tamil Super star Rajinikanth fans are angry at DMDK chief Vijayakanth for his comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X