అభిమానులకు చేదువార్త: వెంటనే రాజకీయాల్లోకి రావాలనిలేదన్న రజనీకాంత్
రాజకీయ ఆరంగేంట్రంపై సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు తేల్చేశారు. వెంటనే రాజకీయాల్లోకి రావాలనే తొందర తనకు లేదని చెప్పారు. ఆయన బుధవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
చెన్నై: రాజకీయ ఆరంగేంట్రంపై సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు తేల్చేశారు. వెంటనే రాజకీయాల్లోకి రావాలనే తొందర తనకు లేదని చెప్పారు. ఆయన బుధవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
Recommended Video

ఒక్కసారిగా షాక్ ఇచ్చిన రజినీకాంత్
ఈ సందర్భంగా మీడియా రాజకీయ ప్రవేశం గురించి అడిగింది. దీనిపై ఆయన స్పందించారు. రాజకీయాల్లోకి వెంటనే రావాలి అనే తొందర లేదని, తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12న అభిమానులతో సమావేశం అవుతానని, కాలా షూటింగ్ పూర్తయిందని చెప్పారు.

రాజకీయ ప్రవేశం గురించి సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని రజనీ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కచ్చితంగా వస్తానని మాత్రం ఆయన చెప్పలేదు. ఇప్పుడు కూడా, వెంటనే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదన్నారు.












Click it and Unblock the Notifications