రజనీకాంత్ కాలా సినిమా సగంలో నిలిపేశారు: టిక్కెట్ డబ్బులు ఇచ్చిన థియేటర్ యజమాని !
బెంగళూరు: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా ప్రదర్శనకు కన్నడ సంఘాలు అవకాశం ఇవ్వడం లేదు. సినిమా థియేటర్ యజమాని ధైర్యం చేసి కాలా తెలుగు చిత్రం షో వేశారు. అయితే కన్నడ సంఘాలు అభ్యంతరం చెప్పడంతో థియేటర్ యజమాని వెనక్కితగ్గి సగంలో సినిమా ప్రదర్శన నిలిపివేశారు.
Recommended Video

రాయచూరులోని పద్మనాభ చిత్ర మందిరంలో గురువారం కాలా తెలుగు సినిమా షో వేశారు. రజనీకాంత్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులతో సినిమా థియేటర్ కిటకిటలాడింది. సాఫిగా అభిమానులు కాలా సినిమా చూస్తున్నారు.

కన్నడ సంఘాలు పద్మనాభ చిత్రమందిరం యజమానిని కలిసి కాలా సినిమా ప్రదర్శన రద్దు చెయ్యాలని, కావేరీ పోరాటానికి సహకరించాలని మనవి చేశారు. కన్నడ సంఘాల మనవి మేరకు పద్మనాభ చిత్ర మందిరం యజమాని కాలా సినిమా ప్రదర్శన సగంలోనే నిలిపివేశారు.

కాలా సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు థియేటర్ యజమాని టిక్కెట్ డబ్బులు తిరిగి చెల్లించడంతో అభిమానులు నిరాశగా వెనుతిరిగారు. కర్ణాటకలో కాలా సినిమా విడుదలకు కన్నడ సంఘాలు వ్యతిరేకించాయి. కాలా సినిమా విడుదల చెయ్యడానికి కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది.












Click it and Unblock the Notifications