రజినీ పొలిటికల్ ఎంట్రీ: డైరెక్టర్ భారతీరాజా అసభ్యకర వ్యాఖ్యలు.. మరీ ఇంత నీచంగానా?

‘రాజకీయాల్లోకి వస్తాను..’ అని అనగానే కోలీవుడ్‌లోని తోటి నటులే రజినీకాంత్ ను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా టాప్ డైరెక్టర్ భారతీ రాజా కూడా రజినీపై దారుణంగా నోరు పారేసుకున్నారు.

చెన్నై: 'రాజకీయాల్లోకి వస్తాను..' అని రజినీకాంత్ అనగానే తమిళనాడు ఉలికి..ఉలికి పడుతోంది. తమిళుడివే కానప్పుడు.. ఇక్కడెలా పోటీ చేస్తావంటూ కోలీవుడ్‌లోని తోటి నటులే రజినీకాంత్ ను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు.

కమల్ హాసన్ లాంటి పెద్ద నటుడు కూడా సూపర్ స్టార్ రజినీపై విమర్శలు గుప్పించారు. తాజాగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ భారతీ రాజా కూడా రజినీపై దారుణంగా నోరు పారేసుకున్నారు. విమర్శలనే కన్నా బూతులు వాడాడంటే బాగుంటుంది.

అత్యంత నీచమైన వ్యాఖ్యలు..

అత్యంత నీచమైన వ్యాఖ్యలు..

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై పూర్తిగా దిగజారిపోయి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ భారతీరాజా. ఫిల్మ్ డైరెక్టర్లు చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్న మాటలకు అక్కడకు వచ్చిన వారంతా నిశ్చేష్టులయ్యారు.

మెరీనా బీచ్‌ సంస్మరణ సభలో...

మెరీనా బీచ్‌ సంస్మరణ సభలో...

వాస్తవానికి మే 17న మెరీనా బీచ్‌లో ఈలం వార్ బాధితులకు నివాళిగా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఆ సభను భగ్నం చేసిన పోలీసులు ఆ ఉద్యమానికి ఆద్యుడైన తిరుమురుగన్ గాంధీని అరెస్ట్ చేశారు. అతడిని అరెస్టు చేసినందుకు గానూ పోలీసులపై మండిపడిన భారతీరాజా.. ఆ సమయంలోనే రజినీకాంత్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

మాకు మంచి నేతలే లేరా?

మాకు మంచి నేతలే లేరా?

తమిళులు కాని వారు తమపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారన్న భారతీరాజా.. ఆ వ్యాఖ్యలను మరింత అసభ్యంగా మార్చేశారు. ‘‘తమిళులకు మంచి నేతలు లేరని వారంటున్నారు. తద్వారా వారొచ్చి మమ్మల్ని ఏలాలని చూస్తున్నారు. సరే.. మా తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం. మరి, మీరొచ్చి ఏం చేస్తారు..?

భాగం అడగొచ్చు కానీ...

భాగం అడగొచ్చు కానీ...

నా భార్య గర్భవతి కాలేదని చెప్పి నా బిడ్డకు తండ్రి అవ్వడానికి నువ్వెవరు? ఏ విషయంలోనైనా భాగం అడగొచ్చు. కానీ, నా పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తాను?'' అంటూ నీచమైన కామెంట్ చేశారు భారతీరాజా.

చేయొచ్చుగానీ.. మరీ ఈ స్థాయిలోనా?

చేయొచ్చుగానీ.. మరీ ఈ స్థాయిలోనా?

డైరెక్టర్ భారతీ రాజా అలా అనేసరికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురై మిన్నకుండిపోయారు. విమర్శలు చేస్తే చేయొచ్చేమోగానీ, మరీ ఇంత నీచంగా మాట్లాడడమేంటంటూ కోలీవుడ్ వర్గాలు కూడా బాహాటంగానే చర్చించుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+