Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకే టైటిల్- రెండు సినిమాలు: రజినీ మూవీ రిలీజ్‌కు బ్రేకులు..?!

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం.. జైలర్. పాన్ ఇండియా మూవీ ఇది. సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ కింద కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. కన్నడ, మలయాళ సూపర్ స్టార్స్ శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమన్నా హీరోయిన్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు.

ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో ఈ దశలో ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. టైటిల్ వల్ల న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుందీ మూవీ. ప్రముఖ మలయాళ దర్శకుడు సక్కీర్ మాడత్తిల్ ఈ సినిమాపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఆగస్టు 2వ తేదీన విచారణకు రానుంది.

Rajinikanth’s upcoming film Jailer has landed in trouble due to its title

సక్కీర్.. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కారణం లేకపోలేదు. జైలర్ అనే టైటిల్‌తోనే ఆయన ఇదివరకు ఓ సినిమాను పట్టాలెక్కించారు. ప్రస్తుతం అది షూటింగ్ జరుపుకొంటోంది. మిగిలిన రాష్ట్రాల్లో టైటిల్ పట్ల తమకు పెద్దగా అభ్యంతరం లేకపోయినప్పటికీ.. కేరళలో కొత్త పేరు పెట్టాలని ఆయన పిటీషన్ దాఖలు చేశారు.

రజినీకాంత్ జైలర్‌లో మోహన్ లాల్ నటిస్తోండటం, అదే టైటిల్‌తో తమ సినిమా కూడా నిర్మితమౌతోండటం వల్ల కలెక్షన్లు ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. రజినీకాంత్ జైలర్ సినిమా కంటే ముందే అదే పేరుతో తాను సినిమాను ప్రకటించానని గుర్తు చేశారు. 2021 ఆగస్టులో కేరళ ఫిల్మ్ ఛాంబర్‌లో అధికారికంగా టైటిల్‌ను నమోదు చేసుకున్నానని వివరించారు.

Rajinikanth’s upcoming film Jailer has landed in trouble due to its title

అదే ఏడాది నవంబర్ 6వ తేదీన సినిమా నిర్మాణాన్ని ప్రారంభించామని పిటీషన్‌లో వివరించారు సక్కీర్ మాడత్తిల్. డిసెంబర్ 15వ తేదీన సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేశామని చెప్పారు. ఈ టైటిల్‌ను షార్జాలో 2023వ తేదీన జూన్‌లో ఆవిష్కరించామని, ఆ కార్యక్రమానికి కమల్ హాసన్ కూడా హాజరయ్యారని అన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మద్రాసు హైకోర్టులో ఉంది. ఆగస్టు 2వ తేదీన విచారణకు రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+